చిత్రరంగంలోకి గంటా ఫ్యామిలీ

మంత్రి శ్రీనివాసరావు చిత్రరంగంలోకి రావడమా? ఇదేం కొత్త విషయం కాదు కదా? ఆయన కొడుకు రవితేజను హీరోగా పరిచయం చేయడానికి ఇటీవలే సినిమా ప్రారంభంచారు కదా అని ఎవరైనా అనొచ్చు. దానికి జయంత్ సి పరాన్జీ దర్శకుడు. కానీ అది కాదు విషయం. చాలా ఏళ్ల క్రితమే మంత్రి గంటా శ్రీనివాసరావు సినిమా రంగంలోకి నిర్మాతగా రావాలని డిసైడ్ అయ్యారు. అప్పట్లోనే కొంతమంది హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. 

ఆ తరువాత ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. కానీ ఆయన అల్లుడు మాత్రం డిస్ట్రిబ్యూటర్ గా ఫుల్ గా సినిమాల్లో ఇన్ వాల్వ్ అయ్యారు. గంటా కొడుకు హీరోగా సినిమా ప్రారంభమయ్యాక, గంటా కూడా తన ఫ్యామిలీ సభ్యుల ద్వారా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు. 

అందుకు తొలి అడుగుగా దర్శకుడు మారుతి డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అలాగే హీరో రామ్ చరణ్ దగ్గర కూడా గంటా ఫ్యామిలీ అడ్వాన్స్ వుంది. సో, మారుతితో సినిమా తరువాత రామ్ చరణ్ సినిమా వుండొచ్చు. అసలు గంటా కొడుకు హీరోగానే మారుతి సినిమా చేయాల్సి వుంది. కానీ అది తప్పింది. అందువల్ల అఖిల్ తో చేయబోయే సినిమా నిర్మాణంలో గంటా ఫ్యామిలీ ఇన్ వాల్వ్ అయ్యే అవకాశం వుంది.

Show comments