అయ్య బాబోయ్.. టీజర్ కూడా లీక్ చేశారు..!

క్రేజ్ పీక్స్ కు వెళ్తే టీజరైనా, సినిమా అయినా ఒక్కటే. ఏదైనా ఆన్ లైన్ లో లీక్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు ఎన్నడూలేని విధంగా ఓ సినిమా టీజర్ లీక్ అయింది. అదే సాహో. ప్రభాస్ హీరోగా నటించనున్న ఈ సినిమా టీజర్ ను శుక్రవారం నుంచి బాహుబలి-2తో పాటు ప్రసారం చేయాలనుకున్నారు. అయితే అత్యుత్సాహంతో కొంతమంది ఈ టీజర్ ను ముందుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇంతకుముందే గ్రేట్ ఆంధ్రా చెప్పినట్టు.. టీజర్ లో గ్రాఫిక్ పార్ట్ ఎక్కువగా ఉంది. ఆఖర్లో డైలాగ్ పెట్టారు. “ఈ రక్తం చూస్తుంటే మనవాళ్లు వీడిని ఏ రేంజ్ లో కొట్టారో అర్థమౌతోంది” అంటూ బ్యాక్ డ్రాప్ లో డైలాగ్ వస్తుంది. “ఆ రక్తం వాడిది కాదన్నా మనవాళ్లది” అన్న డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగ్ వచ్చిన వెంటనే ప్రభాస్ కళ్లుతెరుస్తాడు. మొహంపై పడిన రక్తం తుడుచుకుంటాడు. ఇట్స్ షో టైం అంటూ డైలాగ్ చెబుతాడు. ఇదే సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న సాహో టీజర్.

ఎవరో కావాలనే ఎడిట్ రూమ్ నుంచి సెల్ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. టీజర్ లీక్ అయిందని తెలుసుకున్న వెంటనే యూవీ క్రియేషన్స్ అప్రమత్తమైంది. అన్ని ఎకౌంట్స్ నుంచి టీజర్ ను డిలీట్ చేసింది. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. చాలామంది ఈ టీజర్ చూసేశారు.

Readmore!
Show comments

Related Stories :