మీ అభినందనకు మీడియా ఎందుకు?

కళాతపస్వి కే విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అభినందించడం అన్నది ఆయనను అభిమానించేవారి అందరి కర్తవ్యం. అందరి కన్నా ముందుగా మెగాస్టార్ చిరంజీవి సైలెంట్ గా ఆ పని  చేసి వచ్చారు. దాంతో మిగిలిన వారు కూడా ఆయన బాట పట్టారు బాగానే వుంది. 

అయితే పవర్ స్టార్ పవన్ బాబు వెళ్తున్నారు విశ్వనాధ్ గారిని అభినందించడానికి. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కూడా వెళ్తున్నారు, మీడియా జనాలు రారండోయ్ అని పిలుపు. ఎందుకట? అభినందించేది వాళ్లు. వెళ్లి అభినందించి రావాలి కానీ, మేం అభినందించామోచ్, అని డప్పేసుకోవాలా? అంటే పబ్లిసిటీ కోసం అభినందిస్తున్నట్లా? లేక నిజంగా అభిమానంతో అభినందించినట్లా? 

అలాగే మంత్రి తలసాని వెళ్తున్నారు, మీడియా రావాలోచ్ అని మరో పిలుపు. ఇక మరొకరు ఎవరో వెళ్తారు. మళ్లీ ఛలో అంటూ మీడియా వెళ్లాలా? ఇక ఎందుకు? ఓ రెండు రోజుల పాటు మీడియా జనాలు విశ్వనాధ్ ఇంటి దగ్గర టెంట్ వేసుకు కూర్చుంటే సరి. విశ్వనాధ్ గారిని అభినందించేందుకు కాకుండా, పబ్లిసిటీ కోసం వచ్చేవారికి అది అందించేందుకు. అభినందన అన్నది మనసులో వుండాలి. మర్యాదగా వుండాలి.ప్రశాంతంగా వెళ్లి, పెద్దాయనను మనసారా అభినందించి రావాలి. అంతే కానీ, మళ్లీ దానికి పబ్లిసిటీ ఒకటా?

Show comments