విశాఖ వెళ్తున్న పవన్?

పవన్ కళ్యాణ్ త్వరలో విశాఖ వెళ్లబోతున్నారు. అయితే అదేమీ ప్రత్యేక హోదా కోసమో, ప్యాకేజీ మీద మాట్లాడడానికో కాదు. ఓ సినిమా ఫంక్షన్ కు హాజరయ్యేందుకు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్ సినిమా జాగ్వార్ అడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తాడనుకున్నారు. కానీ రాలేదు. 

అయితే పవన్ నిర్మాతలకు ఈ సభకు తాను ప్రస్తుతం రాలేనని, కానీ వీలయితే మరో సక్సెస్ మీట్ లాంటిది ఏదయినా చేస్తే, గ్యారంటీగా వస్తానని చెప్పినట్లు తెలిసింది. వీలయితే అడియో సక్సెస్ మీట్ లేదా సినిమా విడుదల తరువాత సక్సెస్ మీట్ విశాఖ లో చేసే ఆలోచనలో వున్నామని జాగ్వార్ యూనిట్ పవన్ కు తెలిపినట్లు తెలుస్తోంది. అలా అయిన పక్షంలో తప్పకుండా తాను విశాఖ సభకు వస్తానని పవన్ మాట ఇచ్చినట్లు వినికిడి. 

విశాఖ తప్పకుండా వస్తానని, పవన్ జాగ్వార్ హీరో తండ్రి కుమారస్వామికి స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. అంటే త్వరలో విశాఖ వాసులు పవన్ దర్శనం చేసుకోబోతున్నారన్నమాట.ప్రస్తుతం పవన్ బెంగుళూరులో జిమ్ , బ్యూటీ పార్లర్ వగైరా వ్యవహారాల కోసం బిజీగావున్నట్లు తెలుస్తోంది.

Readmore!
Show comments

Related Stories :