పిక్ టాక్: కమల్ ఈజ్ బ్యాక్!

‘శభాష్ నాయుడు’ సినిమా చిత్రీకరణ లో గాయపడిన కమల్ హాసన్ గత కొన్ని రోజులు మీడియా ముందెక్కడా కనిపించలేదు. సోషల్ మీడియా ద్వారా అప్ డేట్స్ ఇస్తూ ఉండిన కమల్ తాజాగా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లాంజ్ లో దర్శనమిచ్చాడు. ఫ్లైట్ కోసం వేచి చూస్తూ కనిపించాడాయన.

దీంతో కమల్ పూర్తిగా కోలుకుంటున్నట్టే అని స్పష్టం అవుతోంది. జనవరి నెల ఆరంభం నుంచినే  త్రిభాష చిత్రం ‘శభాష్ నాయుడు’ చిత్రీకరణ పునఃప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను కమల్ తన సొంత సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్స్ , లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో లైకా సంస్థ కమల్ డ్రీమ్ ప్రాజెక్టు ‘మురుదనాయగం’ ను పట్టాలెక్కించే ఆలోచనతో ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. 

Show comments