నెత్తురుతో కడిగితే రాతి గుండె కరుగుతుందా!

విభజన తర్వాత మొదటి సారి మన రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రి మోడిగారు ఇచ్చిన పిడికెడు మట్టి, గుక్కెడు గంగ నీళ్ళ సంగతి మర్చిపోయినట్టున్నారు మేధావులు. ఇప్పుడు.. తమ ఆకాంక్షల తీవ్రతను రుధిరంతో తెలియజేస్తే.. ప్రభావం ఉంటుందేమో అని భ్రమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే అంశాన్ని ప్రధాని ద్రుష్టికి తీసుకువెళ్లడానికి భారీ ఎత్తున విజయవాడలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. సేకరించే మొత్తం రక్తాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో మోదీకి కానుకగా పంపబోతున్నారు. 

అయినా, మన వాళ్ల పిచ్చిగానీ, రక్తాభిషేకానికి రాతి గుండె కరుగుతుందనుకోవడం భ్రమ. జనం కోరికలను , వారిలోని సెంటిమెంటును తోసిరాజనడంలో.. తనకంటూ సొంత శైలిని కలిగి ఉన్న మోదీ మహా అయితే ఓ చెంబెడు గంగ నీళ్ళతో ఆ రక్తాన్ని శుభ్రం చేసుకుంటాడు.  అర్ధం పర్ధం లేని,  అందునా హాడావిడి గా అర్ధగంట లోపే చేసిన  రాష్ట్రవిభజనకి కాంగ్రెస్ (అమ్మ) ఎంత భాద్యులో మద్దతిచ్చిన బిజెపి(చిన్నమ్మ) కూడా అంతే బాధ్యులు కాదా!

పార్లమెంట్ లో  ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు పునర్విభజన చట్టంలోని హామీలను ప్రకటించినప్పుడు బిజెపి నే కీలక బాధ్యత వహించిన సంగతి ప్రధాని మోడీ గారికి తెలియనివా! ఇప్పుడు మనం రక్త దానంతో ఆయనకి  తెలియ పరచాలా? మేధావులారా ఆయన అన్నీ తెలిసిన మహా మేధావి. అన్నీ తెలిసిన ప్రధాని మౌనంగా ఎందుకున్నాడు..ఆ మౌనం వెనక మర్మం ఏమిటి. ఇది ప్రశ్నించాటానికి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరు ఏకం కావాలి. అంతే గాని ఎవరి ప్రయోజనాల దృష్ట్యా వారు, వారికి తోచింది మాట్లాడ్డం, కార్యక్రమాలు చేయడం సరికాదు.  

ప్రత్యేక హొదా అనేది ప్రతి ఆంధ్రుడి హక్కు. ఎవరు దీని గురించి ఉద్యమించినా వారికి అండగా ప్రతి ఒక్కరు మద్దతివ్వలి. ఇందులో తన, పర భేదం వుండకూడదు. కొందరు తమింటివాళ్ళు కొందరు అంటరానివాళ్ళు అని ప్రవరిస్తే మరో రెండున్నరేళ్ళు ఎదురు చూపులతో గడిచిపోవడం ఖాయం. Readmore!

కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు , మేధావుల ఫోరం కు చెందిన చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ‘రక్తవితరణ’ ప్రయత్నం జరుగుతున్నది. ప్రజలనుంచి సేకరించిన రక్తాన్ని ప్రధానికి పంపి.. తమ నిరసనను తెలియజేయాలని అనుకుంటున్నారు గానీ.. ఆయనకు తెలియని సంగతిని వీరు తెలియజేస్తున్నారా అనేది ప్రశ్న. అయినా.. అమరావతి శంకుస్థాపన వంటి కీలక కార్యక్రమానికే మట్టి విదిలించిన నాయకుడు.. జనం ఆకాంక్షలను కూడా మట్టిలో కలపకుండా ఉంటాడా అనేది కొందరి అనుమానం. 

Show comments

Related Stories :