మోడీ.. జనాలు లేని ఖండమే మిగిలిందిక!

తూర్పు వైపు ఏషియా-ఓషియానా దేశాల్లో చాలా వాటిని సందర్శించాడు, ఇంకోవైపు రష్యా పూర్తయ్యింది. యూరప్ లో చాలా దేశాలు పూర్తయ్యాయి. పశ్చిమాసియాలోనూ పర్యటన పూర్తి అయ్యింది. అమెరికా కు అయితే చాలా సార్లు వెళ్లొచ్చాడు దక్షిణామెరికాలోని ఒక దేశంలో కూడా పర్యటనను పూర్తి చేశాడు. జనాలు లేని ఖండాలు పక్కనపెడితే, జనాలున్న ప్రతి ఖండంలోనూ మోడీ కాలిడటం త్వరలోనే సంపూర్ణం కానుంది. ఎలాగంటే.. మోడీ ఆఫ్రికా పర్యటనకు సమాయత్తం అవుతున్నాడు. ఇప్పటి వరకూ ఐదు ఖండాల్లోని దేశాలకు మోడీ పర్యటించారు.

పలు ఆసియా దేశాల్లో పర్యటించారు. యూరప్ లో కూడా అడుగుపెట్టారు. ఉత్తరమెరికా, దక్షిణమెరికా ఖండాల్లోని దేశాల్లోనూ పర్యటించారు. ఆస్ట్రేలియాకూ వెళ్లొచ్చారు. ఈ నెల ఏడోతేదీ నుంచి  ఆఫ్రికా పర్యటన అట. ఈ విధంగా ఆరు ఖండాల్లో మోడీ అడుగు పెట్టడం పూర్తి కానుంది. ఇక మిగిలింది జనావాసం కాని అంటార్కిటికా మాత్రమే! 

మోడీ ఆఫ్రికా పర్యటనకు భారత ప్రభుత్వం గట్టి రీజనే చెప్పింది! ఆఫ్రికా దేశాల్లో చైనా తన కార్యకలాపాలను విస్తరిస్తోందని, ఆఫ్రికా దేశాలపై పట్టుబిగిస్తోందని.. అందుకే మోడీ కూడా మోడీ కూడా అక్కడి దేశాలకు వెళుతున్నాడని పీఎంవో చెబుతోంది. అంటే చైనా తోపోటీ పడుతున్నాము కాబట్టి.. చైనా ఏయేదేశాలపై దృష్టి పెట్టిందో  అక్కడక్కడికల్లా భారత ప్రధాని వెళతాడని సంకేలిస్తున్నారు కాబోలు.

అయితే నిన్నలా మొన్న చైనా ఒక వెక్కరింపు చేసింది. చైనాతో పోలిస్తే ఇండియా జీడీపీ పదిపదిహేను శాతం కూడా లేదని చైనా అధికారిక మీడియా వెక్కిరించింది. ముందు ఇలాంటి విషయాల్లో ఇంట గెలిచి.. తర్వాత రచ్చ గెలవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందేమో!

Show comments