అందర్నీ చూపించేయచ్చుగా సారూ?

ఆరు నూరైనా, నూరు ఆరైనా తన 150 వ సినిమా హిట్ అయి తీరాలనే పట్టుదలతో వున్నారు మెగాస్టారు చిరంజీవి. అందకోసం ఎన్ని హంగులు కావాలంటే అన్ని అద్దే ప్రయత్నంలో కిందా మీదా అవుతున్నారు. ఓ పక్క రెండు రాష్ట్రాల్లో ఎన్ని ఫేమస్ గుళ్లు వుంటే అన్నింట్లో పూజలు చేయించేసారు. దేవీ సంగీతం తెలిసిందే.  ప్రభుదేవా కొరియోగ్రఫీ అంటున్నారు. 

అమితాబ్ ను గెస్ట్ పాత్రలో చూపిస్తామని మరో టాక్. మనంలో అలా జస్ట్ మెరిసారు కదా. అదే విధంగా అయి వుండొచ్చు. సినిమా పూర్తయ్యే నాటికి ఇంకా ఎన్ని జోడింపులు వస్తాయో? ఒక్కో జోడింపుతో హిట్ లక్షణాలు కొంచెం కొంచెం పెరుగుతాయని ప్లాన్ అయి వుండొచ్చు. 

చిరంజీవి అంటే టాప్ స్టార్స్ అందరికీ అభిమానమే. రజనీ, మోహన్ లాల్, ఇలా చాలా మందికి ఆయనంటే అభిమానం. చిరు అడగాలే కానీ, అందరూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి సై అంటారు. అడిగితే పోలా? హిట్ గ్యారంటీ అన్న నమ్మకం అప్పుడన్నా మరింత పెరుగుతుంది.

Show comments