సైఫ్‌, కరీనా.. ఓ బుడ్డోడు.!

సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనాకపూర్‌ జంట ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోంది. 'బుల్లి పటౌడీ' తమ కుటుంబంలోకి రావడమే అందుకు కారణం. ఇటు సైఫ్‌ కుటుంబం, అటు కరీనా కుటుంబం సంబరాల్లో మునిగి తేలుతోందిప్పుడు. ఈ రోజు ఉదయమే సైఫ్‌ అలీఖాన్‌ భార్య కరీనాకపూర్‌, మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సైఫ్‌, కరీనా కుటుంబం వెల్లడించింది. బాలీవుడ్‌ ప్రముఖులు పలువురు ముంబై బ్రీచ్‌ కాండీ హాస్పిటల్‌కి వెళ్ళి సైఫ్‌, కరీనాలకు విషెస్ తెలిపారు. 

మరోపక్క సైఫ్‌ - కరీనాల కుమారుడికి 'తైముర్‌ అలీఖాన్‌' అనే పేరు పెట్టినట్లు బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌ జోహార్‌ ప్రకటించడం విశేషం. సైఫ్‌, కరీనా.. ఇద్దరూ బాలీవుడ్‌లో ప్రముఖ నటీ నటులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. సైఫ్‌ అలీఖాన్‌కి ఇంతకు ముందే పెళ్ళయినా, మొదటి భార్యకు విడాకులిచ్చేసి, కరీనాకపూర్‌ని పెళ్ళాడాడు. పెళ్ళీడుకొచ్చిన కూతురు సైఫ్‌కి ఇంతకు ముందే వుందనుకోండి.. అది వేరే విషయం.

Show comments