'పైసావసూల్‌' స్టంపర్‌: బాలయ్యకేమయ్యింది.?

'పైసావసూల్‌' స్టంపర్‌ వచ్చింది. టీజర్‌కీ ట్రైలర్‌కీ మధ్యలో అన్నట్లుగా కొత్త పదాన్ని కనిపెట్టి 'స్టంపర్‌' అంటూ పూరి పెద్ద ప్రయోగమే చేశాడుగానీ, ట్రైలర్‌లో పూరి మార్క్‌ కొత్తదనం ఏమైనా వుంటుందా.? అని ఆశించినవారికి అవేమీ కన్పించలేదు. షరామామూలుగానే పూరి సినిమాల్లో హీరోలానే బాలయ్యతో, మ్యాజిక్‌ చేయించాలని పూరి ప్రయత్నమైతే చేశాడు. 

ట్రైలర్‌ ఎలా వుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, బాలయ్య అభిమానులు ఆందోళన చెందే విషయమొకటి 'స్టంపర్‌'లో వెలుగు చూసింది. బాలయ్య వాయిస్‌ అస్సలేమీ బాగాలేదు. ఏమయ్యింది బాలయ్యకి.? అన్న ప్రశ్న ఇప్పుడు గట్టిగా విన్పిస్తోంది. డైలాగులు చెప్పడంలో బాలయ్య రూటే సెపరేటు. కానీ, ఈ 'పైసా వసూల్‌' దగ్గరకొచ్చేసరికి కొంచెం బొంగురుపోయిన గొంతుతో డైలాగ్స్‌ కష్టంగా అన్పించాయి. 

పూరి సినిమాల్లో హీరో ఎలా బిహేవ్‌ చేస్తాడో, అలా బిహేవ్‌ చేసేందుకు బాలయ్య ప్రయత్నించడం గమనార్హమిక్కడ. మొన్నామధ్య, విదేశాల్లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో బాలయ్య గొంతు బొంగురుపోయింది. ఆ ఎఫెక్ట్‌ ఈ 'స్టంపర్‌' మీద గట్టిగానే పడినట్టుంది. టీజర్‌ వరకేనా, సినిమాలోనూ ఇదే తరహాలో వాయిస్‌ సమస్యలుంటాయా.? ఇదీ ఇప్పుడు బాలయ్య అభిమానుల్ని వేధిస్తోన్న ప్రశ్న.

Show comments