సప్తగిరికి గీతాఆర్ట్స్ తెలుసా?

ఈ డౌట్ మనది కాదు..హీరో సునీల్ ది. హీరో సునీల్  తరువాతి సినిమా జక్కన్న టీజర్ ను ఈ రోజు వదిలారు. హీరో మెటీరియల్ వున్న కథను తీసుకుని, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ తో తయారుచేసినట్లు కనిపిస్తోంది. సునీల్ కు ఇష్టమైన పాటలు, ఫైట్లు ఎలాగూ వున్నట్లే కనిపిస్తోంది. 

Click Here For Jakkanna Movie Teaser

దీంతో పాటు బలమైన విలన్, కథ జోడించినట్లు వున్నారు. ఆ వ్యవహారాల కన్నా, ఫన్ ఎక్కడ కనిపించేలా కేర్ తీసుకున్నట్లున్నారు. టీజర్ లో ఆ వైనం బాగా తెలుస్తోంది. పోసాని వగైరా జనాలతో. టీజర్ లాస్ట్ లైన్.. లాస్ సీన్ అన్నట్లుగా.. కమెడియన్ సప్తగిరి..సునీల్ ను ‘నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా?’ అని ప్రశ్నిస్తే, సునీల్ తన స్టయిల్ అమాయకపు చూపులతో ‘నీకు గీతా ఆర్ట్స్’ తెలుసా అని అడిగేసాడు. 

అవును కదా.. సినిమా జనాలకు మార్షల్ ఆర్ట్స్ కన్నా, గీతా ఆర్ట్స్ నే పాపులర్ కదా? Readmore!

Show comments

Related Stories :