దర్శకుడి విడాకులు.. హీరోయిన్ ప్రేమకు రెక్కలు?

దాదాపు ఏడాదిన్నర కిందట తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించిన ఫర్హాన్ అక్తర్ దంపతులు.. తాజాగా చట్టబద్దంగా విడాకుల ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఇన్నాళ్లూ విడాకులేమీ లేకుండా.. దూరదూరంగానే గడిపేసిన ఈ జంట ఇప్పుడు అధికారికంగా విడిపోయింది. వీళ్ల విడాకుల వ్యవహారం గురించి ప్రత్యక్ష సాక్షులు ఆసక్తిరమైన విషయాలు చెబుతున్నారు. 

ఫర్హాన్ –అదునా భాబానీలు చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరించారు అని.. విడాకుల టేబుల్ వద్ద వాళ్లు చాలా హుందగా ప్రవర్తించారని, పరస్పర అంగీకారంతో చాలా ఫ్రెండ్లీగా వీరి విడాకుల ప్రక్రియ ముగిసిందని.. కోర్టులోని వారు మీడియాకు చెప్పారు. మరి వీరి విడాకుల సంగతిలా ఉంటే.. ఇప్పుడు శ్రద్ధా కపూర్ ప్రేమకు రెక్కలొచ్చినట్టే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఫర్హాన్ అక్తర్, శ్రద్ధాలు ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ సహజీవనంలో ఉన్నట్టుగా కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. వీరి ప్రేమపై శ్రద్ధ తండ్రి శక్తి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే శ్రద్ధ మాత్రం ఈ ప్రేమ కథ గురించి డైరెక్టుగా స్పందించలేదెప్పుడు. మరి ఫర్హాన్ అక్తర్ కు పడిపోయిన శ్రద్ధ అతడి విడాకుల నేపథ్యంలో మరింత దగ్గరవుతుందా.. వీరి ప్రేమ బంధం పెళ్లి వరకూ వెళ్తుందా? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయిప్పుడు.

Show comments