సీనియర్లకు సరైన దారి ఇదేనా..?

సీనియారిటీ పెరిగి అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అవ్వడం అనాదిగా చూస్తున్నాం. ఒకప్పటి హీరోలే నేటి క్యారెక్టర్ ఆర్టిస్టులు. హీరోహీరోయిన్లకు తండ్రులు, తాతలు వీళ్లే. అయితే ఈ పాత్రలతో పాటు విలన్ వేషాలు కూడా వేయొచ్చని నిరూపిస్తున్నాడు ఇప్పటితరం సీనియర్లు. గతంలో ఫ్యామిలీ హీరోలుగా, లవర్ బాయ్స్ గా, యాక్షన్ కింగ్స్ లా చలామణి అయిన ఎంతోమంది సీనియర్లు ఇప్పుడు విలన్లుగా మారిపోతున్నారు.

ఆలిండియా జనాలతో అందగాడు అనిపించుకున్న అరవింద్ స్వామి విలన్ వేషం వేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ విలన్ వేషం వేయడమే కాదు, ఆ పాత్రకు కూడా ఓ గ్లామర్ తీసుకొచ్చాడు అరవింద్ స్వామి. థని ఒరువన్ సినిమాలో విలన్ గా మెప్పించిన ఈ నటుడు, అదే సినిమా రీమేక్ "ధృవ"లో కూడా విలన్ గా నటించి టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేశాడు.

మరో అందగాడు శ్రీకాంత్ కూడా విలన్ గా మారిపోయాడు. ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ నటుడు, క్యారెక్టర్ రోల్స్ కు మారి చాలా రోజులైంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఇప్పుడు నాగచైతన్య మూవీతో  విలన్ గా రీఎంట్రీ ఇస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ పాత్రలతోనే పేరుతెచ్చుకున్న ఈ నటుడు, హీరోగా అవకాశాలు తగ్గడంతో ప్రతినాయకుడి పాత్రల వైపు మొగ్గుచూపుతున్నాడు.

అర్జున్, జగపతిబాబు కూడా ఇప్పటికే విలన్ వేషాలతో మెప్పించారు. మణిరత్నం సినిమాతో విలన్ గా మారిన అర్జున్.. తాజాగా నితిన్ నటిస్తున్న "లై" సినిమాలో కూడా విలన్ గానే కనిపించనున్నాడట. ఇక లెజెండ్ మూవీతో ప్రతినాయకుడిగా మెప్పించిన జగపతిబాబు.. ఓవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్ ట్రాక్ ను కూడా 
కొనసాగిస్తున్నారు.

Readmore!

ఇలా టాలీవుడ్ కు చెందిన సీనియర్లంతా ఒక్కొక్కరుగా క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నాడు. గతంలోలా తండ్రి పాత్రలకే ఫిక్స్ అవ్వకుండా విలన్ క్యారెక్టర్స్ లో కూడా మెప్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది సీనియర్లు ఈ దారిలోకి వస్తారో చూడాలి.

Show comments

Related Stories :