బాహుబలి కంటే స్పైడర్‌ ఇంపార్టెంట్‌

'బాహుబలి' తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన మాట నిజమే కానీ, ఈ చిత్రం స్ఫూర్తితో ఇకపై అన్నీ అలాంటి సినిమాలే తీయడం సాధ్యపడదు. అయిదేళ్ల పాటు నిర్మాణం, ప్రయాసతో పాటు విడుదలకి ముందు వచ్చిన హైప్‌ తదితర ఎక్స్‌టర్నల్‌ ఫ్యాక్టర్స్‌ కూడా బాహుబలికి దోహదపడ్డాయి. ఆ విజయాన్ని మోడల్‌గా పెట్టుకుని మరిన్ని అలాంటివి సాధించడం ప్రాక్టికల్‌గా జరిగే పని కాదు.

బాహుబలి కంటే కూడా త్వరలో రాబోతున్న మహేష్‌ చిత్రం 'స్పైడర్‌' రిజల్ట్‌ తెలుగు సినిమాని ఎక్కువ ప్రభావితం చేయగలదు. ఎప్పటినుంచో మన హీరోలు తమిళ స్టార్‌ దర్శకులతో, అక్కడి హీరోలు మన స్టార్‌ దర్శకులతో చేస్తే, రెండు మార్కెట్లలోను లాభం వుంటుందని అనుకుంటున్నారే తప్ప ఎవరూ ఆచరణలో పెట్టలేదు. మహేష్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌ వల్ల అధిక లాభాలు కనిపిస్తే ఇకపై ఆ దిశగా అడుగులు వేయవచ్చు.

అలాగే ఈ చిత్రానికి మరీ ఎక్కువ సమయం పట్టలేదు కనుక, క్వాలిటీ, బడ్జెట్‌ పరంగా కూడా దీనిని బెంచ్‌ మార్క్‌గా పెట్టుకుని మరిన్ని సినిమాలు తీయవచ్చు. బాహుబలి విజయాన్ని చూసి తెలుగు చిత్ర సీమ గర్వపడడం మినహా చేయగలిగిందేమీ లేదు. అదే స్పైడర్‌ సినిమా మోడల్‌ సక్సెస్‌ అయితే మాత్రం తెలుగు సినీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులొస్తాయి.

Show comments