గో సంరక్షకుల్లారా.. ఇటు చూడండి ప్లీజ్‌!

ఆవును ఎవరైనా చంపితే పాపం.. ఆవు మాంసం తినడానికి వాటిని వధిస్తే.. తిరిగి చంపేసినా.. పాపంలేదు. అదే చట్టంగా మారిపోయింది. అది చాలామంది రోమాలను నిక్కబొడించింపజేస్తే హిందుత్వ వాదం. జనామోదం కూడా దానికి ఉంది. మరి ఆవును ఎవరైనా చంపితే వారిది పాపం, కానీ.. నీళ్లూగడ్డిలేక అవే ఆవులనున కబేళాలకు తోలక తప్పని పరిస్థితి ఏర్పడితే?

దీనిపై హిందుత్వవాదం ఏమంటుంది? దీనిపై హిందుత్వవాద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఫేస్‌బుక్‌లో ఆవులపై అపారమైన ప్రేమాభిమానాలను కురిపించే వీర హిందుత్వవాదులు.. ఏమంటారు? రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు ఇదే దుస్థితి నెలకొని ఉంది.

వర్షాలు లేక వ్యవసాయం చేయడం కష్టతరం అయిపోయిన ఈ ప్రాంతంలో రైతాంగం కేవలం పశుపోషణ మీదే ఆధారపడి జీవనం సాగిస్తోంది. అయితే గతేడాది విపరీతమైన వర్షాభావం ఏర్పడటంతో.. సీమలోని నాలుగు జిల్లాల్లోనూ కరువు తాండవిస్తోంది. పంటలేదు, పశుగ్రాసం లేదు.

వేరుశనగ చేన్లోనే ఎండిపోయింది. చొప్పది(జొన్న) కూడా అదే పరిస్థితి. గత రెండు మూడు నెలల నుంచి గడ్డికాదు కదా, ఆఖరికి ఆవులూ గేదెలకు తాగడానికి నీళ్లు కూడా కష్టం అయిపోయింది. దీంతో.. రైతులు చేసేది లేక, ఆవులను, గేదెలను తేడా లేకుండా కబేళాలకు తోలుతున్నారు. వాళ్లు కానీ ఇంకేం చేస్తారు పాపం?

ఆవును చంపారంటే.. అవతల మనిషి ప్రాణం తీసినా తప్పులేదనే.. హిందుత్వ వాదులు, వారి గట్టి మద్దతును కలిగిన హిందుత్వవాద ప్రభుత్వం సీమవైపు చూడాలి. ప్రతివారం సంతల నుంచి వందల కొద్దీ ఆవులు కబేళాకు తరలుతున్నాయి. ఆవులకు పూజ చేసిన రైతులే.. వాటిని సంతలకు తోలుకెళ్లి అమ్మేస్తున్నారు. వాటి కడుపు మాడ్చలేక.. ప్రాణంతీసే వాడికే అమ్మేస్తున్నారు.

మరి ముందుకు రావాలి.. వీర హిందుత్వవాదులు, వీర హిందుత్వవాద ప్రభుత్వం.. ముందుకురావాలి. కళ్లముందు సాగుతున్న పశువధను ఆపాలి. ఆవుపై తమకున్న భక్తిప్రవత్తులను నిరూపించుకోవాలి. అలా చూపించగలిగిన వాడవడైనా ఉంటే, రాయలసీమలో పశుసంపదను కాపాడటానికి స్వయంగా ముందుకు వచ్చినా, హిందుత్వ వాద ప్రభుత్వాన్ని కదిపి తీసుకొచ్చినా.. అదీ అసలైన హిందుత్వవాదం అవుతుంది. అలాకాకుండా.. ఫేస్‌బుక్‌ పోస్టులు పెట్టే హిందుత్వం జస్ట్‌ఫేక్‌

Show comments