కృష్ణా జిల్లా జనాలకు భక్తి తక్కువా?

అలాగే అన్నారట ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృష్ణ పుష్కరాలకు జాతీయ మీడియాను ఆహ్వానించి, సకల సదుపాయాలు చేసి, స్నానాలు చేయించి, ఆపై వాళ్లు వెళ్లే ముందు బాబు ముచ్చటించారట. ఈ సందర్భంగా జాతీయ మీడియా కృష్ణ పుష్కరాలకు జనం తక్కువగా వచ్చారని, గోదావరి పుష్కరాలకు ఎక్కువగా వచ్చారని అభిప్రాయ పడ్డారట. 

దానికి బాబుగారు సమాధానం ఇస్తూ, కృష్ణా జిల్లాపై కమ్యూనిస్టుల ప్రభావం పోలేదని, అందవల్ల గోదావరి జనాలతో పోలిస్తే ఇక్కడ భక్తి తక్కువని అభిప్రాయం వ్యక్తం చేసారట. కానీ అలా అంటే మళ్లీ ఏమనుకుంటారో అని, కృష్ణా పుష్కరాలకు వివిధ ఘాట్ లకు జనం చెదిరిపోవడం వల్ల తక్కువగా కనిపిస్తున్నారు కానీ, వాస్తవానికి ఎక్కువ మందే వచ్చారని సర్ది చెప్పారట.

నిజమో, అబద్ధమో, బాబుగారి అభిప్రాయామే కరెక్టేమో? కృష్ణా జిల్లా జనాలకు భక్తి తక్కువ కాబట్టే, విజయవాడలో అన్ని గుళ్లు, గోపురాలు కూల్చినా ఎవరు కిక్కురు మనలేదు. ఏ ఆందోళన జరగలేదు. బహుశా ఈ సంగతి తెలుసుకాబట్టే, బాబు తన మానాన తను కూల్చుకుంటూ పోయారేమో?

Readmore!
Show comments

Related Stories :