వామ్మో.. ఈ హీరోయిన్ అంత సంపాదిస్తోందా..!

ప్రపంచంలో అత్యంత అధిక సంపాదన పరులైన హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది దీపికా పదుకునే. తాజాగా ఫోర్బ్స్ మ్యాగ్జిన్ వాళ్లు విడుదల చేసిన వివరాల ప్రకారం.. దీపిక సంపాదన విషయంలో టాప్ టెన్ నటీమణుల్లో పదో స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం దీపిక సంపాదన పది మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే కోటి డాలర్లు. భారత ద్రవ్యమానంలో చెప్పాలంటే దాదాపు 67 కోట్ల రూపాయలు!

ఇదీ దీపిక ఒక సంవత్సరంలో సంపాదిస్తున్న డబ్బు. బాలీవుడ్ లో టాప్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న దీపిక అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీంతో ఆమెకు అంత డబ్బు వస్తోందని ఫోర్బ్స్ పేర్కొంది.

2007లో ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన  ఈ కర్ణాటక భామ ఆ తర్వాత ఎక్కడా వెనక్కు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాలీవుడ్ లో యమ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగడంతో పాటు.. ఇప్పుడు హాలీవుడ్ ఆరంగేట్రానికి కూడా దీపిక రెడీగా ఉంది. ఆమె నటించిన తొలి హాలీవుడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రిప్లెక్స్ సీరిస్ లోని సినిమా కాబట్టి.. దీపికకు కావాల్సినంత గుర్తింపు కూడా దక్కుతోంది ఆ సినిమాతో. మరి అది విడుదల అయ్యి.. హాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు విస్తృతమయితే.. ప్రస్తుతం సంపాదనలో తనకన్నా పై స్థాయిలో ఉన్న హాలీవుడ్ భామలకు కూడా దీపిక పోటీ ఇస్తుందేమో!

Readmore!
Show comments

Related Stories :