తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన డైరక్టర్..కాస్త పెన్ పవర్ వుంది ..మంచి వ్యాసాలు రాస్తారని పేరు. గతంలో ఓ సినీ సెలబ్రిటీతో కాస్త సాన్నిహిత్య సంబంధాలు వున్నాయని వదంతులు కూడా వినిపించాయి. ప్రస్తుతానికి వస్తే, ఇప్పుడు ఆయన భార్యా పిల్లలు చాలా దమనీయ స్థితిలో వున్నారట.
భార్యా పిల్లలను వదిలిపెట్టి, అతగాడు అమెరికా చెక్కేసినట్లు తెలుస్తోంది. పైగా అలా వెళ్లి ఆరు నెలలు దాటిపోవడంతో వీసా టైమ్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. ఇక్కడ పాపం, ఇద్దరు పిల్లల్ని పోషించలేక, తండ్రి పంచన చేరిన ఆ భార్య స్కూల్ లో టీచర్ గా అయిదువేల రూపాయిలకు పనిచేస్తోందట.
భార్యా పిల్లలను గాలికి వదిలి, అమెరికా చేరిన ఆ డైరక్టర్ వైఖరి పట్ల ఇండస్ట్రీలో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. సినిమాలు వున్నా, లేకున్నా, ఏదో ఒకటి చేసి, భార్యాబిడ్డలను పోషించాలి కానీ, ఇలా తప్పించుకు వెళ్లిపోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏం చేస్తాం..సినిమా రంగంలో ఇంతే..ఇంతే అనుకోవాలి..అయితే సూపర్ లేదా..పాపర్.