ఈ వీక్‌ ట్రేడ్‌ టాక్‌

పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కోట్లకి పైగా షేర్‌ సాధించిన ప్రేమమ్‌ చిత్రం వసూళ్లు పదకొండవ రోజు నుంచీ గణనీయంగా పడిపోయాయి. ఈ చిత్రం ముప్పయ్‌ కోట్ల షేర్‌ సాధించినా సాధించవచ్చని ట్రేడ్‌ భావించింది. 

పబ్లిక్‌ టాక్‌, తొలి వారం వసూళ్ల వల్ల ప్రేమమ్‌కి లాంగ్‌ రన్‌ ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రేమమ్‌ కేవలం హిట్‌ స్టేటస్‌తో సరిపెట్టుకునేలా ఉంది. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి, బడా హీరోల జాబితాలో చేరతాడని ఫాన్స్‌ ఆశించారు కానీ నాగచైతన్యకి మరోసారి మామూలు విజయమే దక్కింది. అయితే వరుసపెట్టి ఫ్లాప్‌లు ఇచ్చిన తర్వాత అతనికి ఈ చిత్రం ఊరటనిచ్చింది.

నాగభరణం చిత్రానికి ఓపెనింగ్‌ బాగానే వచ్చింది కానీ దారుణమైన టాక్‌ రావడంతో ముందుకెళ్లలేకపోయింది. ఈవారంలో ఇజం, నందిని నర్సింగ్‌ హోమ్‌ తదితర చిత్రాలు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. మరి వీటిలో దేనికి ప్రేక్షకామోదం దక్కుతుందనేది చూడాలి. 

Show comments