మహేష్ కు పుత్రికోత్సాహం

బుడి బుడి అడుగుల బుజ్జాయిలు ఏం చేసినా పేరెంట్స్ కు ఆనందమే. సామాన్యుడైనా, సూపర్ స్టార్ అయినా అందుకు మినహాయింపు కాదు. దసరా సెలవులు వచ్చాయి కదా, నమత్ర మహేష్ ల కుమార్తె సితార చాక్ లెట్ తయారుచేసే పనిలో పడిందట. ముద్దుగా వుండే సితార చెఫ్ క్యాప్ పెట్టుకుని, చాక్ లెట్ చేస్తున్న పనిలో బిజీగా వున్న ఫొటోలను తల్లి నమ్రత ట్వీట్ చేసారు. ఓ చేత్తో చాక్ లెట్ పని పడుతూ, చెఫ్ టోపీలో కొత్తగా నవ్వులు చిందిస్తూ సితార ఫోటోలకు ఫోజులిచ్చింది.

మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ పర్సన్. ఏడాదికి కనీసం రెండుసార్లయినా వెకేషన్ టూర్లకు వెళ్లాల్సిందే. పిల్లలు స్కూలు కు బయల్దేరేవరకు తను ఇంట్లో వుండాల్సిందే. మురుగదాస్ తో సినిమా కారణంగా, బిజీగా వున్న మహేష్ ఈ ఫోటొలు చూసి మురిసిపోయి వుంటాడు. సందేహమే లేదు.

Show comments