స్వర్ణభారతి యేమీ అగ్రిగోల్డ్ కాదు

అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారాలు రాత్రికి రాత్రి రోడ్డెక్కేసాయి. ఎందుకు? జస్ట్ ఫిర్యాదు అందడంతోనే రాష్ట్రప్రభుత్వం రాత్రికి రాత్రి యాక్షన్ అంటూ రంగంలోకి దిగిపోవడమే కారణం. దాని వెనకాల ప్రభుత్వ పెద్దలకు వుండాల్సిన రీజన్లు వాళ్లకు వున్నాయి.  కానీ ఇలాంటి స్పీడు అన్ని విషయాల్లోనూ వుంటుంది అని అనుకోవడం భ్రమే. నిజానికి ప్రభుత్వం తలుచుకుంటే స్వర్ణభారతి ట్రస్ట్ వ్యవహారాలను బయటకు తీయడం పెద్ద కష్టం కాదు. గడచిన దశాబ్ద కాలంగా ఆ ట్రస్ట్ అంచెలంచెలుగా ఎలా ఎదిగింది? దానికి డబ్బు, భూములు విరాళాలుగా ఏ మేరకు అందాయి? అలా అందించిన వారికి ఏమైనా పరోక్ష మేలు జరిగిందా? ఇలాంటి వ్యవహారాలనే కదా క్విడ్ ప్రో కో అని అంటున్నారు. అలాంటి దాఖలాలు ఏమైనా వున్నాయా? అన్నది తెలియాలంటే అసలు విరాళాలు ఎవరు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? అన్నది తెలియాలి.

స్వర్థభారతి ట్రస్ట్ తమ భూములకు ఆనుకుని వున్న వాటిని కబ్జా చేయడానికి ప్రయత్నించందని, రైతులను ఇబ్బంది పెడుతోందని, బిల్లులు చెల్లించాల్సిన వారికి ఎగ్గొడుతోందని వార్తలు వినవస్తున్నాయి. మరి వీటిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటకు తీయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వంపై వుంది. కానీ ట్రస్ట్ ఎవరిది? సాక్షాత్తూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి కుమార్తె పేరిట వున్నది. కేంద్రం నుంచి ధారాళంగా నిధుల అందుకుంటున్నది. అలాంటి దానిని చంద్రబాబు టచ్ చేస్తారా? సమస్యే లేదు.

Show comments