చుట్టూ తిరిగి అనుష్క దగ్గరకే వచ్చింది

సంఘమిత్ర సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులో లీడ్ రోల్ ఎవరు పోషిస్తారనే అంశంపై చాలా స్పెక్యులేషన్ నడిచింది. ఈ గ్యాప్ లో నీతూ చంద్ర లాంటి కొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఫైనల్ గా ఆ ప్రాజెక్టు అనుష్క చెంతకు చేరినట్టు తెలుస్తోంది. సంఘమిత్ర పాత్ర పోషించాల్సిందిగా అనుష్కకు ప్రపోజల్ వచ్చిందట.

నిజానికి సౌత్ లో ఇలాంటి పాత్రలు చేయాలంటే ప్రస్తుతం అనుష్కకే సాధ్యం. అరుంధతి, రుద్రమదేవి, తాజాగా బాహుబలి చిత్రాల్లో రాజసం ఉట్టిపడే పాత్రల్ని పోషించింది అనుష్క. పైగా గుర్రపుస్వారి, కత్తియుద్ధంలో ఇప్పటికే నైపుణ్యం ఉంది.

వీటన్నింటినీ మించి బాహుబలి-2 సినిమాతో అనుష్కకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. సో.. ఇలాంటి నటి సంఘమిత్ర ప్రాజెక్టులో ఉంటే కచ్చితంగా సినిమా రీచ్ పెరుగుతుంది.

ప్రస్తుతం ఇది ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది. ఇందులో నటించాలా వద్దా అనే విషయంపై అనుష్క సందిగ్దంలో పడింది. ఎందుకంటే ఈ సినిమాకు ఒక్కసారి కమిటైతే కనీసం ఏడాదిన్నర కాల్షీట్లు ఇవ్వాలి. మరోవైపు అనుష్క పెళ్లికి రెడీ అవుతోందనే రూమర్లు ఉండనే ఉన్నాయి.

Readmore!

అన్నట్టు ఈ సినిమాను నిర్మించబోతున్న శ్రీ తేనాండల్ ఫిలిం సంస్థ అనుష్కకు కళ్లుచెదిరే ఎమౌంట్ ఆఫర్ చేసిందట. బాహుబలికి కూడా అనుష్కకు ఇంత మొత్తం దక్కలేదని తెలుస్తోంది.

Show comments