'నక్షత్రం' - పీక్స్‌లో గ్లామ'రసం'.!

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నక్షత్రం' సినిమాకి సంబంధించి ఇప్పటికే పలు రకాల ప్రోమోస్‌ వచ్చేశాయి. హీరో హీరోయిన్లని పరిచయం చేస్తూ ప్రోమోస్‌ చాలానే రిలీజ్‌ చేసేశారు. త్వరలో సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది కూడా. కొన్ని కారణాల వల్ల 'నక్షత్రం' ఆలస్యమయ్యిందిగానీ, లేదంటే ఎప్పుడో సినిమా విడుదలైపోయేదే. 

ఇక, కృష్ణవంశీ సినిమాల్లో సహజంగానే గ్లామర్‌ డోస్‌ చాలా ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ 'నక్షత్రం' అందుకు మినహాయింపేమీ కాదు. ఆ మాటకొస్తే, కృష్ణవంశీ గత చిత్రాలతో పోల్చితే, 'నక్షత్రం' ఇంకా స్పైసీగా వుండబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆడియో రిలీజ్‌ పేరుతో రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌ హీటెక్కించేస్తున్నాయిప్పుడు. 

సందీప్‌ కిషన్‌, రెజినా, సాయిధరమ్‌తేజ్‌, ప్రగ్యా జైస్వాల్‌.. ఇలా సినిమాలో 'కాస్టింగ్‌' చాలా ఎక్కువగానే వుంది. రెజినా, ప్రగ్యా గ్లామర్‌ ఈ సినిమాకే హైలైట్‌ అనే స్థాయిలో ప్రోమోస్‌ని ఇప్పటికే కట్‌ చేసేసి వదిలేసిన విషయం విదితమే. మొత్తమ్మీద, ఆడియో సందర్భంగా రిలీజ్‌ చేసిన స్టిల్స్‌తో సినిమాలో గ్లామ'రసం' ఎక్కువేనన్న విషయాన్ని ఇంకోసారి చెప్పకనే చెప్పేశారన్నమాట.

Show comments