శశికళ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు!

తమిళనాడు సీఎంగా శశికళ బాధ్యతలు స్వీకరించడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. సంక్రాంతికి ఆమె పదవీ బాధ్యతలు తీసుకోవచ్చని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి జనవరి పన్నెండును ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం. ప్రజలు పొంగల్ సంబరాల్లో ఉన్న సమయంలో.. శశి సీట్ డ్రీమ్ ను తీర్చుకోనున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటివరకూ అన్నాడీఎంకే ముఖ్యనేతలెంతో మంది శశిని సీఎంగా చేయాలని అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభ డిప్యూటీ తంబిదురై వంటి వాళ్లు కూడా ఈ విషయంలో చొరవ చూపడంతో పాటు.. పార్టీకి సంబంధించి అన్ని జిల్లాల విభాగాలూ ఈ మేరకు తీర్మానాలు చేయడం కూడా మొదలైంది. రానున్న వారం రోజుల్లో ఈ హంగామా పూర్తి కానుందని తెలుస్తోంది.

శశికళ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమే అని, జనవరి పన్నెండును దీనికి ముహూర్తంగా నిర్ణయించినట్టుగా అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి శశి శరవేగంగా ఆధిపత్యాన్ని సాధించినట్టే. జయ మరణానంతరం అంత్యక్రియలను కూడా అంతా తానై నడిపించిన శశి.. ఆ తర్వాత ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా సాగుతోంది. ముందుగా పార్టీపై పట్టుబిగించింది, పోటీనే లేకుండా చేసుకోంది. సమ్మోహనాస్త్రం సంధించినట్టుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది! Readmore!

Show comments