సగం సినిమా సెట్ లోనే?

దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో బాలకృష్ణ సినిమా చకచకా సాగిపోతోంది. ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. కాస్త గ్యాప్ తరువాత సెకెండ్ షెడ్యూలు ప్రారంభమయింది. హీరో ఇంకా రెండు రోజుల తరువాత ఈ షెడ్యూలు లోకి వస్తారు. అయితే హీరోయిన్ శ్రియ మాత్రం అప్పుడే వచ్చేసింది. ఇలా అగ్రిమెంట్ చేసుకుని, అలా షూట్ కి రెడీ అయిపోయింది.

కోటిన్నర ఖర్చుతో సెట్ వేసారు పూరి-బాలకృష్ణ సినిమా కోసం. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఈ సెట్ లోనే ఓ కాలనీ, ఓ మార్కెట్ , హీరో, హీరోయిన్ ఇళ్లు, వుంటాయట. దాదాపు సగం సినిమా సెట్ లోనే జరుగుతుందట. అలాగే ఈ సెట్ లోనే ఓ పాట కూడా చిత్రీకరిస్తారట.

పూరి స్టయిల్ అంతే. స్క్రిప్ట్ ప్లాన్ చేసినపుడే చకచకా సాగిపోయేలా ప్లాన్ చేస్తాడు. అందుకే సినిమా వర్క్ పరుగెడుతుంది. ఎప్పడయితే సెట్ లోనే చాలా వరకు సినిమా నడుస్తుందో, ఇంక అడ్డు ఆటంకం ఏమంది? మిగిలిన సినిమా విదేశాల్లో వుంటుంది. 

Show comments