తమిళ టెంపర్ కు ఏర్పాట్లు

తెలుగులో ఎన్టీఆర్ కు టర్నింగ్ పాయింట్ సినిమాగా  మారిన టెంపర్ తమిళ వెర్షన్ త్వరలో తెరకెక్కబోతోంది. తమిళనాట సెటిల్ అయిన తెలుగు హీరో విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పైగా టాలీవుడ్ నిర్మాత ఠాగోర్ మధు సినిమాను అందిస్తుంటే, మన సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 

అంటే మొత్తం మీద తెలుగు కథ, తెలుగు హీరో, తెలుగు నిర్మాత, తెలుగు సంగీత దర్శకుడు కలిసి, తమిళ టెంపర్ ను అందిస్తారన్నమాట. ఈ సినిమా షూట్ పార్ట్ త్వరలో ప్రారంభం కానుంది.  రికార్డింగ్ వర్క్ జరుగుతోంది. స్టార్ కాస్ట్ ఎంపిక పూర్తి కాగానే సెట్ మీదకు వెళ్తారు.  తెలుగు వెర్షన్ ను ఏజ్ ఇట్ ఈజ్ గా కాకుండా,  కొద్దిగా పాలిష్ చేసి తమిళ వెర్షన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

Show comments