బాహుబలి-2: ఫస్ట్ పోస్టర్ ఇదిగో!

బాహుబలి- ది కంక్లూజన్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశాడు ఆ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. సినీ ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. అమరేంద్ర బాహుబలి – దేవసేన ల సీక్వెన్స్ కు సంబంధించిన స్టిల్ ను రాజమౌళి విడుదల చేశారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసినట్టుగా ఉన్నారు. ఏప్రిల్ 28 వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదే పోస్టర్ ను తమిళ, మలయాళీ, హిందీ భాషల వెర్షన్లకు సంబంధించి కూడా విడుదల చేశాడు దర్శకుడు. సెకెండ్ పార్ట్ ఫస్ట్ లుక్ కు నెట్ లో మంచి స్పందనే వస్తోంది. 

Show comments