పవన్ రావడం లేదా?

దేవగౌడ మనవడు, కుమారస్వామి గౌడ కొడుకు అయిన నిఖిల్ గౌడ తొలి సినిమా జాగ్వార్. ఈ సినిమా అడియో ఫంక్షన్ ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. పార్క్ హయాత్ లో ఆదివారం సాయంత్రం ఫంక్షన్ జరుగుతుంది. ఈ పంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని ప్రఛారం సాగుతోంది. కానీ పవన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. 

పవన్ ప్రస్తుతం బెంగళూరులో వున్నారు. గడచిన వారం నుంచి మరో వారం వరకు ఆయన బెంగుళూరులో వుండి జిమ్, ఫిజికల్ ఫిట్ నెస్, ఫేస్ గ్లో వగైరా అంశాలపై బిజీగా వున్నారని తెలుస్తోంది. అందువల్ల వచ్చే అవకాశం తక్కువ అంటున్నారు. అందుకే పవన్ తో ఓ బైట్ తీసుకుని, అడియో ఫంక్షన్ లో ప్రదర్శించాలని కూడా అనుకుంటున్నారు. 

ఇందుకోసం ఓ విడియో షూట్ క్రూ బెంగుళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని పవన్ గెస్ట్ హవుస్ దగ్గర ఈ క్రూ అందుకోసం వెయిట్ చేస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

Readmore!
Show comments

Related Stories :