సరికొత్త రికార్డు సృష్టించిన "ట్యూబ్ లైట్"

సల్మాన్ ఖాన్ కొత్త సినిమా పేరిది. ఇప్పుడీ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లో దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే మ్యూజిక్ రైట్స్ రూపంలో 30కోట్ల రూపాయల డీల్ సెట్ చేసుకున్న ఈ మూవీ.. ఆలిండియా థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో రికార్డు సృష్టించింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా 150 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. NH స్టుడియోస్ అనే కంపెనీ... ఇంత భారీ మొత్తం వెచ్చించి ట్యూబ్ లైట్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. 

కేవలం ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి మాత్రమే ఈ మొత్తం వర్తిస్తుంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ కు సెపరేట్ ఎమౌంట్ ఫిక్స్ చేశారు. అంటే... ఒక్క ఇండియాలోనే ట్యూబ్ లైట్ సినిమా 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించాలన్నమాట. అప్పుడు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ అందుకుంటారు. ప్రస్తుతం సల్మాన్ సినిమాలు అటుఇటుగా 4 రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. సో.. గట్టిగా వారం రోజులు ఆడితే చాలు "ట్యూబ్ లైట్" సినిమా అందరికీ లాభాలు తెచ్చిపెడుతుంది. 

మరోవైపు శాటిలైట్ రైట్స్ లో కూడా ఈ సినిమా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. సాధారణంగా శాటిలైట్ రైట్స్ ను ఏదో ఒక ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ కు మాత్రమే ఇస్తారు. కానీ ట్యూబ్ లైట్ శాటిలైట్ హక్కుల్ని మాత్రం 2 ఛానెల్స్ కు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. టీవీల్లో మొదట ప్రసారం చేసే ఛానెల్ ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నమాట. వాళ్లు ఒకసారి టీవీల్లో ప్రసారం చేసిన తర్వాత సర్వ హక్కుల్ని రెండో ఛానెల్ కు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నారట. అంటే రెండో ఛానెల్ ఎన్నిసార్లయినా సినిమాను ప్రసారం చేసుకోవచ్చు. జూన్ 23న ట్యూబ్ లైట్ సినిమా థియేటర్లలోకి రానుంది.

Show comments