ఆవేశంలో అసలు విషయం చెప్పేశాడు

దువ్వాడ జగన్నాథమ్-డీజే సినిమాపై ఒక్కసారిగా వివాదం చెలరేగడంతో స్వయంగా హరీష్ శంకర్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమాలో బ్రాహ్మణ వర్గాన్ని కించపరిచేలా ఏమీ లేదని, పాటలో సాహిత్యం కూడా బ్రాహ్మణ వర్గాన్ని కించపరచదని, త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పాట అర్థాన్ని విడమర్చి చెబుతానని అంటున్నాడు హరీష్ శంకర్.

తన సినిమాకు సంబంధించి ఊహించని విధంగా వివాదం తలెత్తడంతో ఎంతో ఆవేశంగా తన సినిమా పాటను సమర్థించుకున్నాడు. అయితే ఆవేశంలో సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన విషయాన్ని మాత్రం చెప్పేశాడు దర్శకుడు.

డీజే సినిమాలో అల్లు అర్జున్, బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీపై మొన్నటివరకు ఓ పుకారు నడిచింది. జెంటిల్ మేన్ సినిమా తరహాలో బన్నీ నుంచి సడెన్ గా ఓ మేకోవర్ వస్తుందని, సినిమాకు అదే హైలెట్ అవుతుందని వార్తలు వచ్చాయి.

అయితే హరీష్ శంకర్ తాజాగా మాట్లాడిన మాటల్లో.. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బన్నీ బ్రాహ్మణ గెటప్ లోనే ఉంటాడనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

ఏదో కోవర్ట్ ఆపరేషన్ కింద బ్రాహ్మణుడిగా మారలేదని, బన్నీని బై బర్త్ బ్రాహ్మణుడిగా చూపిస్తున్నారనే విషయంపై హరీష్ శంకర్ తనకు తెలియకుండానే క్లారిటీ ఇచ్చేశాడు.

Show comments