'బాహుబలి' - 5 మిస్టేక్స్‌ ఇవేనట

'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.. సరికొత్త రికార్డులతో దుమ్ము రేపేస్తోంది. అక్కడా ఇక్కడా అని తేడా లేదు.. అన్ని చోట్లా రికార్డులు కొల్లగొట్టేస్తోంది. ఒకరిద్దరు చేసే విమర్శల్ని పక్కన పెడితే, మొత్తంగా ఇండియన్‌ సినిమా 'సాహోరే బాహుబలి' అంటోంది. ఆయా సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు 'బాహుబలి' మేనియాలో ఊగిపోతున్నారు. సినిమా పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇండియన్‌ సినిమా సత్తాని రాజమౌళి చాటి చెప్పిన వైనానికి ఫిదా అవుతున్నారు. 

అయితే, ఓ తమిళ దర్శకుడు 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాకి సంబంధించి ఐదు మిస్టేక్స్‌ని ఎత్తి చూపాడు. అవేంటో తెలుసా.? 

1. కేవలం 120 రూపాయలకే 'బాహుబలి' సినిమాని చూడాల్సి రావడం. దీనికి పరిష్కారమేంటంటే, నిర్మాత కోసం థియేటర్ల వద్ద కలెక్షన్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాల్సిందే. 

2. సినిమా నిడివి చాలా తక్కువగా వుంది. కేవలం 3 గంటల్లో సినిమా పూర్తయిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 

3. టూమచ్‌ డిటెయిలింగ్‌ అండ్‌ పెర్‌ఫెక్షన్‌. ఈ దెబ్బతో, చాలామంది ఫిలిం మేకర్స్‌ తమ నమ్మకాన్ని, హెడ్‌వెయిట్‌ని తగ్గించుకునే అవకాశం వుంది. 

4. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కంక్లూజన్‌ అవడానికి వీల్లేదు. ఈ కోవలోనే, మరో పది సినిమాల్ని చూడాలనుకుంటున్నాం సమీప భవిష్యత్తులో. 

5. భవిష్యత్‌ కష్టకాలమే. ఎందుకంటే, బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేయడం అంత తేలిక కాదు. ఈ రికార్డుల్ని కొల్లగొట్టాలంటే భారతీయ సినీ పరిశ్రమలో చాలా ఏళ్ళు పడ్తుంది. 

ఇంతకీ, ఈ తప్పుల్ని ఎత్తి చూపిన దర్శకుడెవరో తెలుసా.? విఘ్నేష్‌ శివన్‌. ఇక్కడ విఘ్నేష్‌ శివన్‌ తప్పుల్ని ఎత్తి చూపానన్నాడుగానీ, రాజమౌళికి హేట్సాఫ్‌ చెప్పాడు. అదే మరి, క్రియేటివిటీ అంటే. 'బాహుబలి'కి ఈ స్థాయిలో వెరైటీ ప్రశంసలు ఎన్నో ఎన్నెన్నో దక్కుతున్నాయి. దటీజ్‌ 'బాహుబలి'.

Show comments