ఆది ఛలో శాండల్ వుడ్?

ఆది సాయికుమార్ కన్నడ రంగంలో కాలు పెట్టాలనుకుంటున్నట్లు ఇంతకు ముందే వెల్లడించాం. తండ్రి సాయకుమార్ కు శాండల్ వుండ్ లో మంచి పేరుంది. అందుకే ఆది కూడా అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. దానికి తొలి వెంచర్ గా కార్తికేయ సినిమాను ఎంచుకున్నారు. 

ఈ సబ్జెక్ట్ కన్నడ రంగానికి పక్కాగా సరిపోతుందని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. సంచిత శెట్టి లేదా మరే కన్నడ రంగంలో పాపులర్ హీరోయిన్ తో అయినా జోడీ కట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసే పని షురూ చేయబోతున్నారు. 

అలాగే ఇటీవల హిట్ అయిన జెంటిల్ మన్ సినిమాను కూడా కన్నడలో రీమేక్ చేస్తే ఎలా వుంటుంది అనే ఆలోచన ఆది చేస్తున్నట్లు వినికిడి. అంటే ఇక ఇటు టాలీవుఢ్, అటు శాండల్ వుడ్ ఇలా రెండు పడవలపై ప్రయాణం చేయాలని ఆది ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Show comments