ఛార్మి పోర్చుగల్‌లో ఏం చేస్తోందో.!

హీరోయిన్‌ ఛార్మి పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఆమె పోర్చుగల్‌లో వుంది. తనకు సోషల్‌ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నవారికి థ్యాంక్స్‌ చెబుతూ, తాను పోర్చుగల్‌లో వున్నానంటూ హింట్‌ ఇచ్చేస్తోంది ఛార్మి. ఇంతకీ, ఛార్మి పోర్చుగల్‌లో ఏం చేస్తోంది.? ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్‌. పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమా పోర్చుగల్‌లో షూటింగ్‌ ప్లాన్ చేశారు. అద్గదీ అసలు విషయం.

ఇంతకీ, ఛార్మి - పోర్చుగల్‌కి ఎందుకు వెళ్ళినట్లు.? కేవలం సినిమా షూటింగ్‌ని పర్యవేక్షించేందుకేనా.? సినిమా షూటింగ్‌లో ఛార్మి కూడా పాల్గొంటోందా.? పూరి జగన్నాథ్‌కి, ఛార్మి అత్యంత సన్నిహితురాలు. పైగా, పూరి కనెక్ట్స్‌ ద్వారా నటీ నటుల ఎంపిక ప్రక్రియ జరిగింది ఈ సినిమా కోసం. అలా, ఛార్మికి ఈ సినిమాతో చాలా అనుబంధమే వుంది. అయితే, ఈ సినిమాలో ఛార్మి కూడా నటిస్తోందని గత కొద్ది రోజులుగా గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఆ గాసిప్స్‌కి ఇప్పుడు కాస్త బలం చేకూరిందంతే. 

అన్నట్టు, ఛార్మి - బాలకృష్ణ గతంలో ఓ సినిమాలో కలిసి నటించారు. అదే 'అల్లరి పిడుగు'. ఆ సినిమా ఫెయిల్యూర్‌ చవిచూసిందనుకోండి.. అది వేరే విషయం. ఇంతకీ, బాలయ్యతో పూరి తెరకెక్కిస్తున్న సినిమాలో ఛార్మి నటిస్తున్నట్టేనా.? నటిస్తే, ఆమె పాత్రేంటి.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.

Show comments