తాప్సీకి గ్లామర్ అంత చులకనైపోయింది

సౌత్‌ సినిమాల్లో పెద్ద హీరోయిన్ల సరసన నటించాలంటే ఎక్స్‌పోజింగ్‌ చెయ్యాల్సిందేనట. అది కూడా హద్దులు దాటిన ఎక్స్‌పోజింగ్‌ అట. బాలీవుడ్‌లో అయితే కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు వస్తాయట. హాట్‌ అండ్‌ క్యూట్‌ తాప్సీ చెబుతోన్న ముచ్చట్లివి. తాప్సీ చేసిన తెలుగు సినిమాలన్నిటిలోనూ దాదాపుగా ఆమె అల్ట్రా మోడ్రన్‌.. అని చెప్పుకునే హాట్‌ అండ్‌ స్పైసీ పాత్రల్లోనే కనిపించింది. అఫ్‌కోర్స్‌, తమిళంలోనూ తాప్సీ చేసింది అదే. 

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. బాలీవుడ్‌కి వెళ్ళాక తాప్సీ కాస్తో కూస్తో మారిపోయింది. అక్కడ మంచి పాత్రలే దొరుకుతున్నాయామెకి. అయినా, తెలుగులో తాప్సీకి మంచి మంచి పాత్రలివ్వడానికి, నటిగా ఏ సినిమాతో ఆమె మంచి మార్కులేయించుకుంది గనుక.? నటన అంతంతమాత్రమే గనుక, గ్లామరస్‌ పాత్రలకే ఆమెను పరిమితం చేసేశారు ఇక్కడి దర్శక నిర్మాతలు. 

ఓ తమిళ సినిమాలో మాత్రం తనకు నటిగా మంచి మార్కులు పడ్డాయనీ, సౌత్‌ అనగానే తనకు అల్ట్రా గ్లామరస్‌ - బోల్డ్‌ పాత్రలే గుర్తుకు వస్తాయనీ, అందుకే అక్కడి సినిమాల్లో నటించే విషయమై కాస్తంత 'సెలక్టివ్‌'గా వుండాల్సి వచ్చిందనీ చెబుతోంది తాప్సీ. బాలీవుడ్‌లో టైమ్‌ బాగుంది గనుక, తాప్సీ కహానీలు చెబుతోందిగానీ.. అంతగా ఇష్టపడని ఆ హాట్ పాత్రలు తాప్సీ ఎందుకు చెయ్యాల్సి వచ్చిందట.! అయినా, బాలీవుడ్‌ని మించిన బోల్డ్‌ కంటెంట్‌ సౌత్‌ సినిమాల్లో వుంటుందా.? 

ఈ మధ్య తాప్సీ ఎక్కడికి వెళ్ళినా, సౌత్‌ గురించిన ప్రశ్నలొస్తున్నాయి. అన్ని సందర్భాల్లోనూ ఆమె ఇచ్చే సమాధానాల్లో సౌత్‌ పట్ల చిన్న చూపే కన్పిస్తోంది. తాజాగా ఓ తెలుగు సినిమాకి కమిట్‌ అయిన తాప్సీ, ఆ సినిమా ప్రమోషన్‌ కోసం సౌత్‌కి వస్తే, ఏం కహానీలు కొత్తగా విన్పిస్తుందో ఏమో.!

Readmore!

Show comments