ఇక ట్రాక్ పై మెరుపులు కనిపించవు

ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో ప్రజలు మర్చిపోలేని పేరు ఉసేన్ బోల్ట్. గత పదేళ్లుగా 100 మీటర్ల పరుగు పందెంలో తనను మించినవాడు లేడని నిరూపించుకున్నాడు. ఇలాంటి అద్భుతమైన స్ప్రింటర్ నేడు ఆఖరి 100 మీటర్ల గెలుపుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇదే తన ఆఖరి పోటీ అని, ఇక 100 మీటర్ల పోటీలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడని చెప్పాడు. అవతల మిగతా వాళ్లు నలభైల్లోకొ వచ్చేంతవరకు అటలలో తమ ప్రస్థానం కొనసాగిస్తూనే వుంటారు, కానీ ‘‘నిండా ముప్పై ఏళ్లు నిండలేదు అప్పుడే ఏమి రిటైర్మెంట్ రా!’’ అని జనం ఆశ్చర్యపోతున్నారు.

జమైకా దేశానికి చెందిన బోల్ట్ చేతిలో 100 మీటర్ల పరుగులో 9.58 సెకన్లతో వరల్డ్ రికార్డ్ మరియు 9.63 సెకన్లతో ఒలింపిక్ రికార్డ్, ఇంకా 200 మీటర్ల పరుగులో 19.19 సెకన్లతో వరల్డ రికార్డ్ మరియు 19.30 సెకన్లతో ఒలింపిక్ రికార్డులు ఉన్నాయి. 21 ఆగస్టు 1986 లో జన్మించిన ఈ మెరుపు వీరుడు, ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి పెరిగాడు. తను స్కూల్లో చదివేటప్పటినుంచే 100 మీటర్ల పరుగుల్లో గెలిచేవాడు.

ఇలా పెరుగుతూ, చాంపియన్ల సహాయం పొందుతూ ఉసేన్ బోల్ట్ కాస్త లైట్నింగ్ బోల్ట్ గా మారాడు. ఒకవేళ తను పరుగులో నెగ్గేవాడు కాకపోయుంటే... క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ గా అయివుండేవాడంట. పరుగు కాకుండా, క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ లాంటి ఆటలను ప్రేమించే ఈ వ్యక్తి, అత్లెటిక్స్ లోంచి రిటైర్ అయిపోయినప్పుడు మాంచస్టర్ యునైటెడ్ కు ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆడాలన్నదే తన జీవిత ఆశయం అని పేర్కొన్నాడు.

ఈరోజు రాత్రి 2 గంటలకు ఉసేన్ బోల్ట్ ఆఖరి 100 మీటర్ల పరుగు స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 లో ప్రసారం కాబోతుంది. ఆ ఆఖరి పది సెకెన్లు చూడడానికి కొన్ని కోట్ల కళ్లు ఎదురు చూస్తున్నాయి. మరి మీరూ ఎదురుచూస్తున్నారా?

Show comments