బిగ్-బి అమితాబ్ బచ్చన్‌తో అవకాశం రావడమే అదృష్టం. బాలీవుడ్‌లో ఏ హీరోయిన్ అయినా, ఏ హీరో అయినా ఇదే మాట చెప్తారు. అంతేనా, సెట్స్‌లో అతనితో వర్క్ చేస్తున్నంతసేపూ టెన్షన్ ఫీలయ్యామనే చెబుతారు. కానీ, అలా చెబితే ఆమె తాప్సీ ఎందుకు అవుతుంది.? అందుకే, తాప్సీ కాస్త డిఫరెంట్‌గా స్పందించింది అమితాబ్ బచ్చన్‌తో 'పింక్' సినిమా కోసం కలిసి నటించడంపై.
తొలుత అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందన్న విషయం తెలుసుకుని, చాలా సంతోషపడ్డమే కాదు, చాలా భయమేసిందట తాప్సీకి. ఆ తర్వాత తమాయించుకుందట. సెట్స్‌లోకి వెళ్ళగానే భయపడిందట కూడా. కానీ, అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకుందట. సెట్స్‌లో అమితాబ్ బచ్చన్‌ని చూశాక, అతనితో మాట్లాడాక మొత్తం భయం పోయిందట. అప్పటినుంచీ అమితాబ్ బచ్చన్‌ని జస్ట్ కో-స్టార్ మాత్రమేనని ఫిక్సయ్యిందట.
'ఔను.. సెట్స్‌లో అమితాబ్‌ని సాధారణ నటుడిగా చూడకపోతే, నేను నటించలేను. అందుకే సెట్స్‌లో వున్నంతసేపూ అమితాబ్ బచ్చన్‌ని మెగాస్టార్‌లా భావించలేదు. ఆయనతో చాలా క్యాజువల్‌గా నటించేస్తున్నాను..' అంటూ షూటింగ్ అనుభవాల్ని చెప్పుకొచ్చింది తాప్సీ. ఈ సినిమా తన కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్ ఫలిం అవుతుందనీ, అమితాబ్‌తో కలిసి నటించే అవకాశం రావడమే కెరీర్‌లో బెస్ట్ మూమెంట్ అనీ తాప్సీ చెబుతోంది.
మిగతా మాటలెలా వున్నా, అమితాబ్‌ని జస్ట్ కో-స్టార్ అనడం, షూటింగ్‌లో సాదారణ నటుడిలా మాత్రమే చూశాననీ తాప్సీ చెప్పడమే కాస్త ఇబ్బందికరంగా వుందంటున్నారు బాలీవుడ్ సినీ జనం.