ఒక్కసారి వెనక్కు తిరగండి ఫ్రెండ్స్

పోలవరం..మనకు వరం..ఇలాంటి ప్రాజెక్టు మనకు దక్కడమే అదృష్టం. పోలవరం పనులు చకచకా..ఇలా రకరకాల హెడ్డింగ్ లతో మన బాబుగారి అస్మదీయ పత్రికలు మురిసి ముక్కలైపోతున్నాయి. అసలు ఇంతకీ పోలవరం ఇప్పుడు కొత్తగా పుట్టుకు వచ్చిందా? అది ఏనాటి కల? గతంలో ఏం జరిగింది? అసలు పోలవరం ఎవరు ఇచ్చారు ఇప్పుడు? ఒక్కసారి ఆలోచించండి.

పోలవరం అన్నది దశాబ్దాలుగా నానుతున్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఎన్నో ప్రభుత్వాలను చూసింది. ఆఖరికి ఎవరిపైనా ఆధారపడకుండా, వైఎస్ తన హయాంలో, కేంద్రంలో తనకు వున్న పరపతితో ప్రాజెక్టుకు అనుమతి సాధించగలననే దీమాతో, కాల్వల నిర్మాణం చేపట్టేసారు. కాల్వల నిర్మాణానానికి ఎవరి అనుమతి అక్కరలేదు. ప్రాజెక్టు అనుమతి వచ్చేసరికి కాల్వలు రెడీగా వుంటాయి. అప్పుడు ప్రాజెక్టు ఒక్కటీ ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది అన్నది వైఎస్ ఆలోచన. 

అప్పుడు ఇదే అస్మదీయ పత్రికలు ఎంత గగ్గోలు పెట్టాయి. గుత్తేదారులను పోషించడానికే ఇదంతా చేస్తున్నారు. ప్రాజెక్టులు లేని కాల్వలు దేనికి? ఏం చేసుకోవడానికి..ఇంత అంచనాలు...అంత అంచనాలు అంటూ. 

మరి ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రాజెక్టులకు అంచనాలు తన చిత్తానికి పెంచుతున్నా రాయడానికి వీళ్లకు అక్షరాలు లేవు..కాగితాలు లేవు. సరే, ఆ సంగతి అలా వుంచితే, బాబు పట్టిసీమ అన్నారు. పత్రికలు అపర భగీరథుడు అన్నాయి. మరి ఆ పట్టిసీమకు ఆలంబన ఏమిటి? నాడు వైఎస్ కట్టిన కాలవలేగా? ఆ కాలవలు లేకుంటే బాబు పట్టిసీమ అంత త్వరగా సాధ్యం అయ్యేదా? మరి అయ్యో అప్పుడు కాల్వలు కట్టినపుడు వైఎస్ ముందు చూపును తాము విమర్శించామే అన్న పశ్చాత్తాపం కనిపించిందా? పట్టిసీమ పై బాబును పొగుడుకోండి తప్పులేదు. కాల్వలు కట్టిన వైఎస్ గుర్తుకురాలేదా? Readmore!

సరే, అదయిపోయింది. ఇప్పుడు పోలవరం పరుగులు 2019నాటికి ప్రాజెక్టు కట్టాల్సిందే అని బాబు అంటున్నారు. పత్రికలు ..బాబు సూపరెహె..అంటున్నాయి. మంచిదే. మరి ఇఫ్పుడు కాల్వలు మొదలుపెడితే అయ్యేపనేనా ఇది? అంటే మరి ఆనాడు వైఎస్ ముందు చూపు మంచిదని ఇప్పటికైనా ఒప్పుకుంటాయా? తాము పేజీలకు పేజీలు ఈ కాల్వలపై వండి వార్చిన కథనాలకు కనీసం ఇప్పుడైనా నాలుక కరుచుకుంటారా? అబ్బే..మన చర్మాలు బాగా దళసరి. 

పోనీ ఆ సంగతి కూడా అలా వుంచుదాం. పోలవరం ప్రాజెక్టును ఇప్పుడు ఎవరు ఓకె చేసారు. మోడీనా? బాబునా? ఇద్దరూ కాదు. ఏ కాంగ్రెస్ ను తుంగలో తొక్కమని చంద్రబాబు పదే పదే పిలుపునిచ్చారో? విభజన చేసిన భాజపా, కాంగ్రెస్ ల్లో భాజపాను తలకెత్తుకుని, మీడియా తన కాళ్ల కింద దేన్నయితో తొక్కేసిందో, ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎప్పుడు విభజన సమయంలో. అప్పుడే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని విభజన చట్టంలోకి తీసుకువచ్చింది. అదేదో తమ ఘన కార్యమన్నట్లు, అదే ప్యాకేజీలో భాగం చేసారు మోడీజీ. 

ఇన్ని వాస్తవాలు ఇలా వుంటే, ఇప్పుడు కేవలం పోలవరం అన్నది ఆంధ్రకు బాబుగారు ఇస్తున్న వరం అన్నట్లుగా ఫోకస్ ఛేస్తోంది మన మీడియాలో ఓ వర్గం. ఇలాంటి మీడియా వుండడం మన ప్రారబ్ధం.

Show comments

Related Stories :