కూతుళ్ళంటే కమల్‌కి ఎంత ప్రేమో.!

పెద్దకుమార్తె శృతిహాసన్‌ ప్రేమలో పడిందన్న విషయం తెలియగానే, కమల్‌హాసన్‌కి కోపమొచ్చిందట. అయితే ఇది సాధారణ గాసిప్‌ మాత్రమే. ఈ గాసిప్‌ రాగానే, కమల్‌హాసన్‌ స్పందించాడు. 'నా కుమార్తె మీద నేనెందుకు ఆగ్రహం ప్రదర్శిస్తాను.. ప్రేమ విలువేంటో నాకు తెలుసు. ఆమె ఎవర్నయినా ప్రేమిస్తే, ఆ వ్యక్తి సమర్థుడు పైగా ఆమెకు తగినవాడే అయి వుంటాడు. ఈ విషయంలో నా కుమార్తెకు నా పూర్తి సపోర్ట్‌ వుంటుంది..' అంటూ వివరణ ఇచ్చాడు. 

ఇక, చిన్న కుమార్తె అక్షరహాసన్‌ మతం మార్చుకుంది. ఈ విషయంలోనూ కుమార్తె నిర్ణయాన్ని కమల్‌హాసన్‌ సమర్థించాడు. 'నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. నువ్వెప్పుడూ నా కుమార్తెవే.. నీకు నా మద్దతు ఎప్పుడూ వుంటుంది..' అంటూ కమల్‌హాసన్‌ సోషల్‌ మీడియాలో స్పందించడం గమనార్హం. 

తమ తండ్రి తమకింతలా మద్దతిస్తుండడం పట్ల కమల్‌ కుమార్తెలిద్దరూ అమితానందానికి గురవుతున్నారు. 'డాడీ యూ ఆర్‌ ది బెస్ట్‌..' అంటూ తండ్రికి థ్యాంక్స్‌ చెబుతున్నారు. అన్నట్టు, శృతిహాసన్‌ లవ్‌ ఎఫైర్‌ విషయంలో కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతోన్న విషయం విదితమే. బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నా, ప్రేమిస్తున్న విషయాన్ని మాత్రం ఆమె ధృవీకరించకపోవడం గమనార్హం.

Show comments