ఈ హీరోయిన్ ఆ హీరోకి భార్యగా సరిపోతుందట!

తమ సోదరుడు రణ్ బీర్ కు తగిన భార్యను వెదుకుతున్నారు కరీనా, కరిష్మా. ఈ విషయంలో వారి ఓటు  సోనమ్ కపూర్ కు పడింది. సోనమ్ అయితే రణ్ బీర్ కు తగిన  జోడీ అవుతుందని అభిప్రాయపడ్డారు ఈ అక్కచెల్లెల్లు. అయితే రణ్ బీర్ కు తగిన వధువు విషయంలో, తమకు వదిన విషయంలో ఇది వరకూ కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు కరీనా, కరిష్మాలు. 

కత్రినా, దీపికల విషయంలో వీరు పెదవి విరిచారు. రణ్ బీర్ ఆ హీరోయిన్లతో స్నేహాలు చేస్తున్న  రోజుల్లో… వాళ్లతో డేటింగ్ ఉన్న సమయంలో.. కరీనా, కరిష్మాలు మాట్లాడుతూ.. ఆ హీరోయిన్లు ఇద్దరూ కూడా, రణ్ బీర్ కు తగిన వారు కాదని స్పష్టం చేశారు. కత్రినాకు కానీ, దీపికకు కానీ.. తమకు వదిన అయ్యే అర్హతలు లేవని వీరు స్పష్టం చేశారు.

సోనమ్ కు మాత్రం వీళ్లు ఫుల్ మార్కులు వేస్తున్నారు. సోనమ్ ను రణ్ బీర్ పెళ్లి చేసుకుంటే ఆనందిస్తామని అంటున్నారు. మరి.. సోనమ్- రణ్ బీర్ ల మధ్య అయితే ఇప్పుడంత స్నేహం కనిపించడం లేదు. వీళ్లిద్దరూ ఒకే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో సన్నిహితంగా ఉండే వారు, ఆ తర్వాత దూరం పెరిగింది. ప్రస్తుతం సోనమ్ కూడా వేరే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టుంది. మరి కరీనా, కరిష్మాల వ్యాఖ్యలు రణ్ బీర్- సోనమ్ లను దగ్గర చేస్తాయేమో చూడాలి!

Readmore!
Show comments