మార్నింగ్ శృంగారం.. మహా ముద్దు!

జీవితంలో అనుభవించదగ్గ ఎసెన్షియల్ ప్లజర్స్ లో ఒకటి మార్నింగ్ సెక్స్! అంటున్నారు అధ్యయనకర్తలు. మాక్సిమ్ మ్యాగ్జిన్ లో ప్రచురితం అయిన ఈ అధ్యయనం వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రాతఃకాల శృంగారం ఎంతో ఆరోగ్యకరమైనది ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. రాత్రి పూట నిద్రతో రిలక్సేషన్ పొందిన దేహానికి సహజంగానే తెల్ల వారే సరికి శృంగార వాంఛ పెరుగుతుందని, ఇది ప్రతి ఒక్కరికీ అనుభవమే అని  పరిశోధకులు వివరించారు. నిద్రతో లభించిన స్వాంతనతో శృంగార సంబంధ హార్మోన్ల విడుదల పెరిగి.. కాంక్ష పెరుగుతుందని, అలాంటి సమయంలో కలయికతో ఆనంద స్థాయి పెరుగుతుందన్నారు.

శృంగార సామర్థ్యానికి కూడా అది అనుకూలమైన పరిస్థితి అన్నారు. అనుభూతి పరంగానే కాదు.. ఆరోగ్యం పరంగా చూసినా ఇందులో బోలెడన్ని లాభాలున్నాయని వివరించారు.

సమయానికి భోంజేయడం, తగినంత నిద్రను కలిగి ఉండటం, వారంలో ఐదు సార్లు వ్యాయామం చేయడంతో శరీర ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో.. లేలేత కిరణాలు తాకేవేళ శృంగారంతో అన్నే లాభాలు ఉంటాయని అధ్యయన కర్తలు లెక్కగట్టడం విశేషం. స్లీపీ మార్నింగ్ సెక్స్ అనేది మీకు మీరు ఇచ్చుకోగల బెస్ట్ థింగ్.. లైఫ్ సేవింగ్ బెనిఫిట్.. అని పేర్కొన్నారు. మార్నింగ్ సెక్స్ రక్తపోటును తగ్గిస్తుందని, హార్ట్ అటాక్ ను నిరోధిస్తుందని వివరించారు.

మార్నింగ్ సెక్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుందని, కోల్డ్ , ఫ్లూ వైరస్ లనుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు.

మార్నింగ్ సెక్స్ వల్ల ఆక్సిటోసిన్ వరదలా వెల్లువెత్తుతుందని.. ఇది ఫీల్ గుడ్ కెమికల్ అని శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. అంతిమంగా.. మార్నింగ్ సెక్స్ రోజును చాలా గ్రేట్ గా మార్చేస్తుందని కాబట్టి.. ఈ దిశగా ముందుకు వెళ్లమనేది వీరి సూచన. డైలీ రొటీన్ లో ఈ సెక్స్ విటమిన్ ను యాడ్ చేసుకోవాలనేది వీరి ఆర్డర్!

Show comments