పచ్చమీడియా.. సిగ్గు, సిగ్గు..!

ఇంకా ప్రతిపాదన దశలోనే దాన్ని పతాక శీర్షికలకు ఎక్కించారు… చైనా కంపెనీకి ఉక్కు కంపెనీ పెట్టే ఆలోచన ఉంది.. అనే మాత్రానికే పతాకశీర్షికలో వార్త రాశారు! అభిమానం అలాంటిది మరి. ఇంకా ప్రతిపాదనే, అది కార్యరూపం దాల్చిన నాటికి కంపెనీ ఏర్పడినట్టు. అంత వరకూ వేచి ఉండలేం అంటారా, కనీసం కంపెనీ ఏర్పాటు అనేది కనీసం పేపర్లలలో సంతకాలు చేసేంత వరకూ వచ్చిన నాటికి, ఆ ఒప్పంద పత్రాల్లో ఏపీ ప్రభుత్వం, చైనా  కంపెనీ సంతకాలు చేసిన నాడు రెండు ఫుల్ పేజీలలో వార్త రాశారంటే అదో ముచ్చట! అయితే.. ఆ కంపెనీ అంత వరకూ వెళుతుందో వెళ్లదో! ఎవరో ఒక కంపెనీ ప్రతినిధి నోటి మాటగా చెప్పిన మాటే పచ్చ పేపర్ల పాలిట పతాక శీర్షిక అయ్యింది!

చంద్రబాబు పాలనను మెచ్చి ఆ చైనా సంస్థ ఉక్కు కంపెనీని పెట్టడానికి ముందుకొచ్చిందని రాసుకొచ్చారు. బాగుంది. ఇంతేనా.. ఆ కంపెనీ ఎక్కడ నెలకొల్పాలో, దానికి ఎక్కడి భూములు కేటాయించాలో కూడా బాబుగారు అప్పుడే ఒక అంచనాకు వచ్చేశారట! అదెక్కడ అంటే.. కడప జిల్లాలో, భూములు ఏవంటే… బ్రహ్మణీ స్టీల్స్ కు కేటాయించిన భూములనే ఈ చైనా కంపెనీకి కేటాయిస్తారట!

విన్నారా.. ఈ వింతను విన్నారా! ఏ భూమి అయితే పచ్చని ప్రకృతి, కిలకిల పక్షుల రావాలు, లేళ్లు కుందేళ్లకు.. ఆలవాలమో ఆ భూమినే ఇప్పుడు చైనా కంపెనీకి కేటాయించాలని బాబుగారు అప్పుడే డిసైడ్ చేశారని, పచ్చ మీడియా తన ఫాలో అప్ కథనాల్లో రాసుకొచ్చింది. తొలి రోజు కంపెనీ ఏర్పాటు నోటి మాట పతాక శీర్షికగా చేసి, రెండో రోజున కడప జిల్లాకు బాబుగారు తెచ్చిపెట్టిన వరంగా  అభివర్ణన జరిగింది!

మరి గాలి జనార్ధన్ రెడ్డి బ్రహ్మీణీ స్టీల్స్ ను ఏర్పాటుకు భూమి పూజ చేసినప్పుడు, ప్రభుత్వం అందుకు భూములు కేటాయించినప్పుడు ఎంతలా గగ్గోలు పెట్టారు! తొండలు గుడ్లు పెట్టడానికి కూడా  ఇష్టపడని ఆ భూముల్లో అద్బుతమైన ప్రకృతి సంపద ఉందని.. ఇలాంటి చోట స్టీల్ కంపెనీ పెట్టడం వల్ల ఆ ప్రకృతి సంపదకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని నాడు పతాక శీర్షికల్లో అచ్చేసింది ఈ పచ్చమీడియా. వాటిని పట్టుకుని తెలుగుదేశం నేతలు నానా యాగీ చేశారు! Readmore!

మళ్లీ ఇప్పుడు అవే భూములు.. గాలి జనార్ధన్ రెడ్డికి కేటాయించిన భూములను వెనక్కు లాక్కొని, వాటిని చైనా కంపెనీకి అప్పగిస్తారట.. అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయిస్తారట! మరి ఇప్పుడు ప్రకృతి రమనీయత మాటేమిటి? వైఎస్ హయాంలో ఆ భూములకు భారీ పరిహారం ఇప్పించి సేకరిస్తే అదో పాపం అయిపోయింది. ఇప్పుడు చైనా కంపెనీకి అవే భూములు కేటాయించడాన్ని ఏమనాలి? అంతే.. బ్రహ్మణీస్టీల్స్ కు భూమి కేటాయించడం అప్పట్లో పచ్చ మీడియా నచ్చలేదు, ఇప్పుడు నచ్చుతోంది! అప్పుడేమో అక్కడ పరిశ్రమను వ్యతిరేకించారు, ఇప్పుడు నోటిమాటనే పతాక శీర్షికకు ఎక్కించి తరిస్తున్నారు. ఏదేమైనా పచ్చ మీడియా లీలలు అన్నీ ఇన్నీ కావు!

Show comments

Related Stories :