మరోసారి బాలయ్య సరసన నయనతార

వెంకటేశ్ తో చేసిన బాబు బంగారం తర్వాత మరో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు నయనతార. అడపాదడపా డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తున్నప్పటికీ.. వాటికి రెస్పాన్స్ అంతంత మాత్రమే. మళ్లీ ఇన్నాళ్లకు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు సైన్ చేసింది ఈ బ్యూటీ. బాలకృష్ణ సరసన మరోసారి మెరవనుంది.

బాలకృష్ణ-నయనతార కలిసి ఇప్పటికే 2 సినిమాలు చేశారు. 2010లో బాలయ్య సరసన సింహా సినిమాలో నటించిన నయనతార... 2011లో శ్రీరామరాజ్యం సినిమా చేసింది.

ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సినిమాలో కనిపించనుంది. బాలయ్య హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారు.

నిజానికి తన వందో సినిమాకే నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాడు బాలకృష్ణ. ఆ టైమ్ లో ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో కాల్షీట్లు కేటాయించలేకపోయింది నయన్. ఇప్పుడు తన 102వ సినిమాకు మరోసారి ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు బాలయ్య. Readmore!

ఇప్పటికే ప్రకటించిన ఈ ప్రాజెక్టును ఈ నెలాఖరుకు ప్రారంభిస్తారు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ సినిమాకు రెడ్డిగారు అనే టైటిల్ అనుకుంటున్నారు.

Show comments

Related Stories :