'పాపిస్తాన్‌'తో ఇక 'నో' క్రికెట్‌.!

ఔను, మీరు విన్నది నిజమే, పాపాల పాకిస్తాన్‌.. అనబడే 'పాపిస్తాన్‌'తో ఇకపై ఎక్కడా క్రికెట్‌ ఆడకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య క్రికెట్‌ పోటీలు దాదాపుగా నిలిచిపోయాయి. భారత జట్టు పాకిస్తాన్‌ వెళ్ళడంలేదు.. పాకిస్తాన్‌ జట్టు భారత్‌కి రావడంలేదు. అయితే, విదేశాల్లో జరిగే ట్రై సిరీస్‌, ఇతర టోర్నీల్లో మాత్రం అప్పుడప్పుడూ భారత్‌, క్రికెట్‌ తలపడ్తున్నాయి. ఇకపై ఆ పోటీలకి కూడా చెక్‌ పెట్టాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 

పాకిస్తాన్‌తో క్రికెట్‌ ఆడదలచుకోవడంలేదు.. అందుకే ఇకపై ఏ టోర్నీలో అయినాసరే, భారత్‌ - పాక్‌ ఒకే గ్రూప్‌లో వుండకుండా చూడాల్సిందిగా, ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. ఇండియన్‌ క్రికెట్‌, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఐసీసీకి వచ్చే ఆదాయంలో ఎక్కువభాగం భారత క్రికెట్‌ తరఫునే వస్తోంది. దాంతో, ఐసిసి కూడా బిసిసిఐ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువ. 

అయితే, ఇక్కడ ఓ చిక్కు లేకపోలేదు. క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌లో భారత్‌ - పాకిస్తాన్‌ పోటీ పడాల్సి వస్తే.? ఈ ప్రశ్నకు సమాధానంగా, 'అలాంటి సందర్భాల్లో చెయ్యడానికేమీ లేదు..' అంటూ బీసీసీఐ స్పష్టతనిచ్చింది. ఆటకి ఇతర వివాదాలతో ముడిపెట్టడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు. కానీ, ఇది 125 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన విషయం. పాపాల పాకిస్తాన్‌తో ఆట ఏంటి.? సినిమా ఏంటి.? ఏదైనాసరే, పాపిస్తాన్‌ పాపాల్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిందే. ప్రపంచంలో పాపిస్తాన్‌ని ఏకాకిని చెయ్యాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావులేదు.

Show comments