చెక్కులు బౌన్స్ అవుతున్నాయట

సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ అంటే ప్రాణం పెట్టేస్తారు. సినిమా బాగా ఆడితే ఫరవాలేదు. లేదూ అంటే ఇక చాలా బిల్లులకు ఎగనామం పెడతారు. టాలీవుడ్ లో చిన్న చిన్న, కొత్త బ్యానర్లకు ఇది అలవాటే. అందుకే అప్పటికీ ముందుగానే పేమెంట్లు తీసుకోవాలనుకుంటారు అందరూ. అయినా అలా తీసుకున్నా కూడా సమస్యే. 

ఇటీవల విడుదలై ఫట్ మన్న ఓ సినిమాకు సంబంధించి ఇచ్చిన కొన్ని ఫబ్లిసిటీ చెక్కులు బౌన్స్ అవుతున్నాయట. చాలా పెద్ద మొత్తం వెచ్చించి తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫటేల్ మని పేలిపోయింది. దీంతో మొత్తం పెట్టుబడికే ఎసరు వచ్చింది. దానికి తోడు అదనపు బిల్లులు. మరి రిటర్న్ ఏమీ రాకుంటే, వీటికి చెల్లింపుల ఎలా? బహుశా అందుకనే బౌన్స్ అవుతున్నాయేమో?

Show comments