సోనాక్షి అయిటమ్ కు ఓకె అంటుందా?

సుకుమార్ సినిమాలో అయిటమ్ సాంగ్ లు అంటే ఓ రేంజ్ లో వుంటాయి. సుకుమార్ సినిమా అయిటమ్ సాంగ్ అంటే దేవీశ్రీ ప్రసాద్ కూడా చాలా కేర్ తీసుకుంటాడు. అందుకే సుక్కూ లేటెస్ట్ గా చేస్తున్న రామ్ చరణ్ మూవీ అయిటమ్ సాంగ్ మీద అందరి దృష్టి వుంది. 

ఈ అయిటమ్ సాంగ్ కోసం సుకుమార్ కూడా బాగానే కేర్ తీసుకుంటున్నారట. బాలీవుడ్ హీరోయిన్లు ఎవరినన్నా స్పెషల్ అప్పీరియన్స్ కు ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారట. ఇలాంటి జాబితాలో సోనాక్షి సిన్హా టాప్ లో వుంది. సోనాక్షిని తెలుగులోకి తేవాలని ఎప్పటి నుంచో మెగా క్యాంప్ ట్రయ్ చేస్తోంది. ఉయ్యాలవాడ సినిమాకు కూడా చిరు పక్కన సోనాక్షిని ఒప్పించాలని ప్రయత్నాలు వున్నాయి.

మరి ఆ ప్యాకేజ్ లో పార్ట్ గానే ఈ స్పెషల్ సాంగ్ కు కూడా అడుగుతున్నారేమో? తెలియదు. ఐటెంసాంగ్ కోసం సోనాక్షిని అప్రోచ్ అయితే అయ్యారు. కానీ అమ్మడు ఇంకా ఎస్ ఆర్ నో చెప్పలేదట. ఆమె నో అంటే అప్పుడు వేరే బాలీవుడ్ భామను ట్రయ్ చేస్తారట.

Show comments