బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, నటనతోనే కాదు.. సినీ నిర్మాణంతోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆ మధ్య 'ఎన్‌హెచ్-10' సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్న అనుష్క, తాజాగా 'పిల్లౌరి' సినిమాలో నటిస్తూ, ఆ సినిమాకి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. నటన, నిర్మాణం.. వీటిల్లో ఏది తేలిక.? అనడిగితే, రెండూ కష్టమేనని చెబుతోంది అనుష్క శర్మ.
సినిమా నిర్మాణం అంత తేలిక కాదనీ, సోలో నిర్మాతగా సినిమాలు చేయడం చాలా కష్టమనీ, సహ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నప్పుడే, సినిమా నిర్మాణం ఎంత కష్టమో తనకు అర్థమయ్యిందని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. అలాగని నటనను తక్కువగా చూడలేనంటున్న అనుష్క, దేని కష్టం దానిదేననీ, నటిగా - నిర్మాతగా ఏకకాలంలో ఓ సినిమా చేయడం ఇంకా కష్టమని అనుష్క అభిప్రాయపడింది.
సినిమాల్లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ స్ర్కిప్ట్ ప్రకారమే వుంటుందన్న అనుష్క శర్మకి కంప్లీట్ రొమాంటిక్ మూవీలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా, ఆ కోరిక మాత్రం నెరవేరడంలేదనట. పూర్తిస్థాయి నిర్మాతగా త్వరలోనే ఓ 'రొమాంటిక్' ప్రయత్నం చేయబోతున్నట్లు చెప్పింది అనుష్క శర్మ. పూర్తిస్థాయి రొమాంటిక్ సినిమా అంటే అందులో అడల్ట్ కంటెంట్ తరహాలో ఏమీ వుండదు కదా.? అని ప్రశ్నిస్తే, ఆ లిమిట్స్ తనకు తెలుసని అనుష్క సమాధానమిచ్చింది.