శ్రీకాంత్ కు టర్నింగ్ పాయింట్

టాలీవుడ్ లో ఎవరి కెరీర్ ఎప్పుడు టర్నింగ్ ఇచ్చుకుంటుందో ఎవరికీ తెలియదు. జగపతి బాబు ఇన్నింగ్స్ ముగిసింది అనుకునే టైమ్ కు లెజెండ్ వచ్చి మొత్తం సీన్ మార్చేసింది.

ఆ సినిమాతో జగపతి బాబు మళ్లీ వీర బిజీ అయిపోయాడు. ఈ సినిమాను సమర్పించిన సాయి కొర్రపాటి మళ్లీ మరో సినిమాతో హీరో శ్రీకాంత్ కు అలాంటి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

నాగచైతన్య హీరోగా కొత్త డైరక్టర్ తో సాయి కొర్రపాటి ఓ వైవిధ్యమైన రివెంజ్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రేవతి, రావు రమేష్ ఇద్దరూ చైతూ తల్లి తండ్రులుగా నటిస్తున్నారు. సినిమాలోని మరో కీలక పాత్రను శ్రీకాంత్ పోషిస్తున్నారట.

ప్రత్యేకమైన సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేయడం శ్రీకాంత్ కు కొత్త కాదు. కానీ ఈ సినిమాలో పాత్ర మాత్రం పూర్తిగా డిఫరెంట్ గా వుంటుందట. ఈ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ టర్నింగ్ ఇచ్చుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆగస్టులో విడుదలయ్యేందుకు వీలుగా ఈ సినిమా రెడీ అవుతోంది.

Show comments