ఆటగాడు.. పాటగాడు.. అక్కినేని బుల్లోడు.!

అక్కినేని బుల్లోడు ఆటగాడు.. అవును, క్రికెటర్‌ అవుదామనుకున్నాడు.. సెలబ్రిటీ క్రికెట్‌లో సత్తా చాటాడు. సినిమాలపై ఇంట్రెస్ట్‌ పుట్టుకొచ్చిందిగానీ, లేదంటే మంచి క్రికెటర్‌ అయ్యేవాడేమో.! అంతేనా, అక్కినేని బుల్లోడు పాటగాడు కూడా. సాక్ష్యం కావాలా.? పైన ఫొటోలు చూస్తున్నారు కదా.. అదే సాక్ష్యం. 

సైమా అవార్డుల వేడుక అబుదాబీలో జరిగింది. ఈ వేడుకలోనే అక్కినేని అఖిల్‌ పాటేసుకున్నాడు. అలా అక్కినేని అఖిల్‌ పాట పాడుతోంటే అంతా ఆశ్చర్యపోయారు. చిన్నప్పటినుంచే అఖిల్‌కి, పాటలు పాడటంపై కొంతమేర శిక్షణ ఇప్పించిందట నాగార్జున సతీమణి, ఒకప్పటి హీరోయిన్‌ అమల. అఖిల్‌, పాటలు పాడటం ప్రాక్టీస్‌ చేస్తున్న సంగతి తనకు తెలుసని నాగార్జున కూడా వెల్లడించాడు తాజాగా. 

తనయుడు అక్కినేని అఖిల్‌ ఓ వేదికపై పాట పాడటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన నాగార్జున, అలా పాట పాడటం కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశాడని అన్నాడు. ప్రస్తుతం అఖిల్‌, 'మనం' ఫేం విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. తొలి సినిమా 'అఖిల్‌' నిరాశపర్చడంతో, ఈ సినిమాని అఖిల్‌ రీ-లాంఛ్‌ మూవీగా అక్కినేని నాగార్జున ఇప్పటికే ప్రకటించేశాడు.

Readmore!
Show comments