వైఎస్ పేరు.. తెలుగు పత్రికల శునకానందం!

అదో ప్రముఖ పత్రిక.. ఇంకా చెప్పాలంటే.. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీగా చెప్పుకొంటూ ఉంటారు. ఆ పత్రికలో ఒక క్రికెట్ స్టేడియం పేరును యథాతథంగా రాయడం లేదు! పతాక శీర్షికలో వార్త రాసి.. ఆ స్టేడియం పేరులో సగం మాత్రమే రాసి.. అదే ఆ మైదానం పేరు అని భ్రమింపజేయడానికి ఆ పత్రిక ప్రయత్నాలు చేస్తోంది. 

పూర్తి పేరు రాయడానికి అంత భయమా! పూర్తి పేరు రాస్తే ‘వైఎస్ రాజశేఖర రెడ్డి’ అనే పేరును రాయాల్సి వస్తుందని ఈ ఉలికిపాటు! ఎంత రాజకీయంగా ఆయనంటే పడకపోతే మాత్రం.. ఆఖరికి ఆయన పేరును రాయడానికి అంతగా భయపడాలా! జనాలు  ఏమీ అమాయకులు కాదు, నవ్వుతారు.. అనే సిగ్గూఎగ్గూ ఏమీ లేకుండా వ్యవహారించడమే ఆ మీడియా వర్గానికి అబ్బిన జర్నలిజం!

వైజాగ్ తొలిసారి ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది. టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వడానికి అర్హత సంపాదించిన.. “డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం’’ మైదానం పేరును తెలుగులోని పత్రికారాజాలు పూర్తిగా రాసే సాహసం చేయలేదు. ఈ మైదానం తొలి సారి ఒక టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వార్తలను పతాక శీర్షికల్లో అయితే ఇస్తూ.. మైదానం పేరును మాత్రం తప్పుగా రాయడం ద్వారా ఆ పత్రికలు వైఎస్ విషయంలో తమ వైఖరి ఏమిటో, ఆయన పేరు రాయడం అంటే తమకు ఎంత బాధాకరమైన అంశమో తేటతెల్లం చేశాయి.

‘వీసీఏ-వీడీసీఏ’ స్టేడియం అట! ఇదీ ఆ పత్రికలు.. వైజాగ్ స్టేడియంకు పెట్టుకున్న పేరు! ప్రభుత్వం.. అధికారికంగా పెట్టిన పేరును కాకుండా.. తమకు అనువుగా ఉన్న పేరును రాసుకుని ఆ పత్రికలు స్వయంతృప్తి పొందాయి! ఈ విధంగా రాజశేఖర రెడ్డి మరణించాకా కూడా ఈ పత్రికలను, వీటి అధినేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాడు. ఆయన ఊహే వీళ్లకు నిద్రలేకుండా చేస్తున్నట్టుంది! 

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఉప్పల్ స్టేడియంకు రాజీవ్ గాంధీ పేరుంది. అక్కడ మ్యాచ్ జరిగితే రాజీవ్ పేరు రాస్తారు, ఇంకా చాలా మైదానాలకు దివంగతులైన రాజకీయ నేతల పేర్లున్నాయి..  వాటి పేర్లనూ యథాతథంగా రాస్తారు. అయితై వైఎస్ పేరు రాసే ధైర్యం మాత్రం ఈ పత్రికలకు లేకపోయింది! ఉషోదయానే పాత్రికేయ విలువలు అంటూ మాట్లాడే వాళ్ల అసలు కథలు ఇలా ఉన్నాయి. 

తను కూస్తే తప్ప తెల్లవారదనుకునే భ్రమలో ఉండే కోళ్లు ఈ పత్రికలు. లేకపోతే.. అధికారికంగా వైఎస్ పేరు మైదానానికి ఉంది. లైవ్ టెలికాస్ట్ చేసే స్టార్ నెట్ వర్క్ వాడు.. ఈ బ్యాచ్ కాదు, వాళ్లు ‘డాక్టర్ వైఎస్ఆర్ వీసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం’ అనే వ్యవహరిస్తారు. కామెంటరేటర్లూ ఇదే పేరే చెబుతారు!

అయితే.. వైఎస్ వ్యతిరేకత పత్రికలు మాత్రం.. తమ శునకానందాన్ని తాము పొందుతున్నాయి!   తాము రాయకపోవడం ద్వారా స్వయంతృప్తిని పొందుతున్నాయి! 

Show comments