స్టార్ హీరో సరసన జ్యోతిక?

వివాహానంతరం, పిల్లలు పుట్టిన తర్వాత నటిగా సెకెండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది  జ్యోతిక. హీరోయిన్ గా అవకాశాలు ఉన్న దశలోనే వివాహం చేసుకున్న జ్యోతిక నటనకు భర్త సూర్య నుంచి మంచి ప్రోత్సాహమే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని సినిమాలు చేసింది. అయితే అవన్నీ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లాంటివే. కానీ ఇప్పుడు ఆమె ఒక స్టార్ హీరో సినిమాలో చేయడానికి అవకాశం పొందినట్టు సమాచారం.

అది విజయ్ సరసన. విజయేంద్ర ప్రసాద్ కథతో రూపొందనున్న విజయ్ 61 వ సినిమాలో జ్యోతిక ఒక కథానాయికగా నటించనుందని సమాచారం. ఇందులో గ్లామర్ కోసం వేరే హీరోయిన్లు ఉంటారని, విజయ్ సరసన జ్యోతిక కూడా నటిస్తుందని తెలుస్తోంది.

తద్వారా 14 యేళ్ల తర్వాత విజయ్- జ్యోతికల కాంబినేషన్ రిపీటవుతోంది. అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి ‘ఖుషీ’ సినిమాలో జంటగా నటించారు. అది తమిళంలో సూపర్ హిట్ కావడంతో పాటు తెలుగులో కూడా రీమేకయ్యింది. ఆ సంగతలా ఉంటే.. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఒక స్టార్ హీరో సరసన నటించడంతో జ్యోతిక కెరీర్ కొత్త ఊపందుకుంటుందేమో చూడాలి!

Show comments